ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి
ABN , Publish Date - Feb 02 , 2026 | 10:40 AM
రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.
రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 2: మహేశ్వరం మండల కేంద్రంలోని కేసీ తండాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న ఇద్దరు బాలురు కేసీ తండా సమీపంలోని కొత్వాల్ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. కేసీ తండాకు చెందిన జటావత్ రిషి, బద్రీనాథ్ అనే ఇద్దరు బాలురు ఆటలాడుకుంటూ చెరువు సమీపానికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. వారి కుటుంబ సభ్యులు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
చెరువులో గాలింపు చర్యలు చేపట్టిన బృందం కొద్దిసేపటికే ఇద్దరి మృతదేహాలను వెలికితీసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో కేసీ తండా ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నారుల మరణంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
మేడారం మహాజాతర విజయవంతం: మంత్రి సీతక్క
లండన్‌కు మంత్రి నారాయణ.. కీలక ప్రాజెక్టుల పరిశీలన
Read Latest Telangana News And Telugu News