మేడారం మహాజాతర విజయవంతం: మంత్రి సీతక్క
ABN , Publish Date - Feb 02 , 2026 | 08:29 AM
మేడారం సమక్క - సారక్క అమ్మవార్ల మహాజాతర విజయవంతమైందని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని చెప్పుకొచ్చారు.
ములుగు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మేడారం సమక్క - సారక్క అమ్మవార్ల మహాజాతర (Medaram Maha Jatara) విజయవంతం అయిందని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు చిన్న చిన్న అసౌకర్యాలు కలిగినందుకు చింతిస్తున్నామన్నారు. వీవీఐపీల తాకిడి వల్లే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకొచ్చారు.
సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లతో తమకు భావోద్వేగ బంధం ఉందని మంత్రి సీతక్క ప్రస్తావించారు. అందుకే అన్ని జాగ్రత్తలు చేపట్టామని వివరించారు. జాతరకు వెళ్తే ఏదో జరుగుతుందని ఓ వర్గం ప్రచారం చేసిందని తెలిపారు. జాతరను తక్కువచేసి చూపాలన్న కుటిల ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ జాతరకు జనం తండోపతండాలుగా తరలివచ్చారని చెప్పుకొచ్చారు. మహాజాతర అనంతరం తాను పారిపోయినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. తాను పారిపోయేరకం కాదని.. ప్రజల కోసం పంతం నెగ్గించుకునే వ్యక్తినని స్పష్టం చేశారామె. ఆదివాసీల అస్తిత్వం కోసం పరితపించే బిడ్డనని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ సమగ్ర దర్యాప్తు.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే..!
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా జర్నలిస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి
Read Latest Telangana News And AP News And Telugu News