ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా జర్నలిస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:32 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ భవన్ వద్దకు కవరేజీ కోసం వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన కెమెరా జర్నలిస్ట్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని(KCR) సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ భవన్ దగ్గరకు కవరేజీ కోసం వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి(ABN Andhrajyothy) సంస్థలకు చెందిన కెమెరా జర్నలిస్ట్ పవన్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. కవరేజీ చేస్తున్న కెమెరామెన్ పవన్‌పై కుర్చీతో దాడిచేసి, కెమెరాను కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులు బీఆర్ఎస్ కార్యక్రమాలను కవర్ చేయొద్దని బెదిరింపులకు దిగారు. సదరు జర్నలిస్టులు కనిపిస్తే దాడులు చేస్తామని బెదిరింపులకు దిగారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హార్వర్డ్‌లో 'స్టూడెంట్' రేవంత్‌రెడ్డి.. 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌తో ప్రపంచ వేదికపై గర్జన..
అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
Read Latest Telangana News And AP News And Telugu News