Share News

వాస్తవాలు రాస్తే దాడులు చేస్తారా.. బీఆర్‌ఎస్‌పై ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఫైర్

ABN , Publish Date - Feb 02 , 2026 | 07:17 AM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఖండించారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, సెంటిమెంట్‌ను రగిలించడం బీఆర్ఎస్ సిద్ధాంతమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవాలు రాస్తే దాడులు చేస్తారా.. బీఆర్‌ఎస్‌పై ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఫైర్
Congress MLA Naini Rajender Reddy

హనుమకొండ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) సంస్థలపై బీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Congress MLA Naini Rajender Reddy) ఖండించారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, సెంటిమెంట్‌ను రగిలించడం బీఆర్ఎస్ సిద్ధాంతమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బతుకంతా సెంటిమెంట్ మీద బతకడమేనని ధ్వజమెత్తారు. తెలంగాణను దోచుకున్న మీరు.. ఎవరు మాట్లాడితే వారిపై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.


ఈ సందర్భంగా వరంగల్ వేదికగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబానికి చెందిన వ్యక్తులపై మీ ప్రతాపమా అని నిలదీశారు. సిట్ పిలిస్తే కేసీఆరే కాదు.. ఎవరైనా పోవాల్సిందేనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి ఉన్నా ఆయనను జైల్లో పెట్టిన సంగతి మర్చిపోయారా అన్నారు. ఇకపై బీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.


సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు రాజెేందర్. ఆంధ్రజ్యోతి ఎండీ నిజాలు రాస్తే ఆంధ్రా అని ముద్ర వేస్తారా? అని ఫైర్ అయ్యారు. మీరు ఆంధ్రా వెళ్లి రొయ్యలు, పీతలు తినొస్తే ఏం లేదా అని ఎద్దేవా చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. వాస్తవాలు రాస్తే దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని ఎమ్మెల్యే రాజేందర్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ సమగ్ర దర్యాప్తు.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే..!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా జర్నలిస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 08:03 AM