లండన్‌కు మంత్రి నారాయణ.. కీలక ప్రాజెక్టుల పరిశీలన
ABN , Publish Date - Feb 02 , 2026 | 09:47 AM
మంత్రి నారాయణ బృందం లండన్‌కు చేరుకుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా అక్కడ పలు ప్రాజెక్టులను మంత్రి అధ్యయనం చేయనున్నారు.
లండన్/అమరావతి, ఫిబ్రవరి 2: అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాజెక్టులను అధ్యయనం చేసేందుకు గానూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ(Minister Narayana) బృందం లండన్ చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా అక్కడ పలు కీలక ప్రాజెక్టులను పరిశీలించి, అమరావతిలో అమలు చేయగలిగే ఆధునిక పట్టణ ప్రణాళిక, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ వంటి అంశాలపై నారాయణ బృందం అధ్యయనం చేయనుంది. లండన్ కాలమానం ప్రకారం.. ఉదయం 11:00 గంటలకు లండన్ సిటీ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గ్విన్ రిచర్డ్స్‌తో మంత్రి సమావేశం కానున్నారు. ఈ భేటీలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, అంతర్జాతీయ సహకార అవకాశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే మధ్యాహ్నం 1:30 గంటలకు బెటర్సీ పవర్ స్టేషన్‌ను(Battersea Power Station) నారాయణ బృందం సందర్శించనుంది. అనంతరం థేమ్స్ రివర్ ఫ్రంట్(Thames Riverfront) ప్రాంతాన్ని పరిశీలించనుంది. సాయంత్రం 4:30 గంటలకు లండన్ బ్రిడ్జి(London Bridge) నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి.. అక్కడి బ్రిడ్జ్, సరౌండింగ్ ఏరియాల అభివృద్ధి, ట్రాన్స్‌పోర్ట్ ఇంటిగ్రేషన్ వంటి అంశాలను అధ్యయనం చేయనుంది.
ఈ బృందంలో మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్‌లు ఉన్నారు. ఈ పర్యటన ద్వారా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆధునిక ఆలోచనలు, టెక్నాలజీలు సేకరించడమే లక్ష్యమని తెలుస్తోంది. ఈ నెల 2, 3 తేదీల్లో లండన్‌లో.. 4, 5 తేదీల్లో దోహాలో ఈ బృందం పర్యటించనుంది.
ఇవి కూడా చదవండి..
మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు
మేడారం మహాజాతర విజయవంతం: మంత్రి సీతక్క
Read Latest AP News And Telugu News