Home » London
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన కొనసాగుతోంది. పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడుల వేట అక్కడ కూడా కొనసాగిస్తున్నారు.
ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా సమావేశాలు నిర్వహించారు. లండన్‌లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్‌గెరాల్డ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.
లండన్‌లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన చేయనున్నారు. నవంబరు 2వ తేదీ నుంచి సీఎం చంద్రబాబు లండన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైంది.
లండన్ నుంచి గిఫ్ట్ ప్యాక్ పంపుతున్నామంటూ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర రూ.47 లక్షల కాజేసిన అపరిచిత వ్యక్తుల కోసం సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. తంజావూరు వైద్య కళాశాల రోడ్డుకు చెందిన 64 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగిని సెల్‌ఫోన్‌కు జూలై 8వ తేది ఫోన్ చేసిన ఓ మహిళ తాను ఆ ఉద్యోగి క్లాస్‌మేట్‌నంటూ పరిచయం చేసుకుంది.
చదువుకున్న వాళ్లు, వృద్ధులు, మహిళలు, యువకులు ఇలా అన్ని వర్గాల వారిని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. 'మీ కొడుక్కి ప్రమాదం జరిగిందంటూ' తాజాగా ఓ మహిళ నుంచి లక్షల్లో డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేశారు.
ఇంగ్లాండ్ దేశం, భారతదేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్-యుకె వాణిజ్య భాగస్వామ్యాన్ని అత్యంత ముఖ్యమైనదిగా ఇరు దేశాల ప్రధానులు అభివర్ణించారు.
బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు ముంబైలో ఘన స్వాగతం దక్కింది. ముంబైలో వ్యాపార వేత్తలతో కీర్ సమావేశమయ్యారు. రేపు ప్రధానితో భేటీ ఉంటుంది. తన పర్యటన గురించి, కీర్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బ్రిటన్ రాజధాని లండన్‌లో మహాత్మా గాంధీ విగ్రహంపై జాత్యాహంకారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. లండన్‌లోని టావిస్టాక్ స్వ్కేర్‌లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లండన్‌లో పర్యటిస్తున్నారు. మంగళవారం లండన్‌లో హైప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించారు లోకేష్.