CM Chandrababu: ఏపీకి పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. లండన్ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీ
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:35 PM
ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా సమావేశాలు నిర్వహించారు. లండన్‌లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్‌గెరాల్డ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.
అమరావతి, నవంబరు3 (ఆంధ్రజ్యోతి): ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తల (London Industrialists)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వరుసగా సమావేశాలు నిర్వహించారు. లండన్‌లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్‌గెరాల్డ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ(సోమవారం) భేటీ అయ్యారు. లండన్‌లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థ అతిపెద్ద విద్యుత్ సరఫరాదారుగా ఉంది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు.
అమరావతి, విశాఖపట్నంలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు స్పష్టం చేశారు సీఎం. 160 గిగావాట్లు గ్రీన్‌ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని వెల్లడించారు. అలాగే విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు వివరించారు ముఖ్యమంత్రి. ఈ రంగంలో ఏపీ నిర్దేశించుకున్న మన లక్ష్యాలను వెల్లడించారు. ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్‌గెరాల్డ్ ని ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
అశోక్ హిందుజాతో సీఎం చంద్రబాబు సమావేశం
మరోవైపు.. హిందుజా గ్రూప్ భారత్ చైర్మన్ అశోక్ హిందుజాతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను సీఎం వివరించారు. ఈ నేపథ్యంలో హిందూజా గ్రూప్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏపీలో దశలవారీగా రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం హిందుజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని.. మరో 1,600 మెగావాట్లకు పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు అంశంపై ఒప్పందం చేసుకుంది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఏపీలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్ ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఏపీలో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ ఎకో సిస్టం అభివృద్ధికి సహకరించనుంది హిందూజా గ్రూప్.
ఈ వార్తలు కూడా చదవండి...
కృత్రిమ మేధస్సుతో అడవి ఏనుగుల సమస్య పరిష్కారం: పవన్ కల్యాణ్
మంచి వెనకే చెడు.. అంతా డైవర్ట్ కోసమేనా?.. వర్మ అనుమానాలు
Read Latest AP News And Telugu News