Share News

Pawan Kalyan: కృత్రిమ మేధస్సుతో అడవి ఏనుగుల సమస్య పరిష్కారం: పవన్ కల్యాణ్‌

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:38 PM

కృత్రిమ మేధస్సు ద్వారా వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కుంకీ ఏనుగుల నుంచి కృత్రిమ మేధస్సు వరకు.. ప్రజలు, వన్యప్రాణుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టడంలో ఏపీ ముందంజలో ఉందని ఉద్ఘాటించారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan: కృత్రిమ మేధస్సుతో అడవి ఏనుగుల సమస్య పరిష్కారం: పవన్ కల్యాణ్‌
Pawan Kalyan

అమరావతి, నవంబరు3 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధస్సు ద్వారా వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. కుంకీ ఏనుగుల నుంచి కృత్రిమ మేధస్సు వరకు.. ప్రజలు, వన్యప్రాణుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టడంలో ఏపీ ముందంజలో ఉందని ఉద్ఘాటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ట్వీట్ పెట్టారు. కుంకీల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వరకు.. మానవ – వన్యప్రాణుల మధ్య సంఘర్షణ నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారి చూపుతోందని పేర్కొన్నారు. ఏపీ సరిహద్దుల్లోని అటవీ పరిసర గ్రామాల్లో అడవి ఏనుగులు చొరబడి చేస్తున్న విధ్వంసాన్ని అరికట్టేందుకు, మానవ – వన్యప్రాణుల సంఘర్షణను నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఆవిష్కరించిందని ఉద్ఘాటించారు పవన్ కల్యాణ్.


చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఏఐ (AI) ఆధారిత వ్యవస్థ, సౌరశక్తి సాయంతో పనిచేస్తూ ఏనుగుల సంచారాన్ని గుర్తించడంతోపాటు ఏనుగులని స్వల్పంగా భయపెట్టి సహజ సిద్ధమైన నిరోధక వ్యవస్థను కలిగి ఉంటుందని వివరించారు. ఇప్పటికే అడవి ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకువచ్చామని గుర్తుచేశారు. ఇప్పటికే పలు సందర్భాల్లో గ్రామాల్లోకి చొరబడిన అడవి ఏనుగులను కుంకీలు విజయవంతంగా, సురక్షితంగా అడవిలోకి మళ్లించాయని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.


ఏనుగుల బెడద నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించే చర్యలను మరింత ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్ విధానంతో పని చేసే సరికొత్త వ్యవస్థను ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ వ్యవస్థ ఏనుగుల సంచారాన్ని గుర్తించడంతోపాటు వాటిని స్వల్పంగా భయపెడతాయని తెలిపారు. ఏనుగులను గుర్తించిన వెంటనే అటవీ శాఖ అధికారులకి హెచ్చరిక సంకేతాలు పంపుతాయని తెలిపారు. తద్వారా అటు మనుషులు, ఇటు వన్యప్రాణులకు రక్షణ వ్యవస్థలా ఉపయోగపడతాయని వివరించారు పవన్ కల్యాణ్.


120 మీటర్ల పరిధి నుంచి 60 మీటర్ల దూరం వరకు సున్నిత ప్రాంతాలను ఈ వ్యవస్థ నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పుకొచ్చారు. పంటల నష్టాన్ని నివారించడంతోపాటు మనుషులు – ఏనుగుల మధ్య సంఘర్షణను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నొక్కిచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)ల దార్శనిక నాయకత్వంలో ఒక స్థిరమైన లక్ష్యసాధన దిశగా ముందుకు వెళ్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్‌కు పట్టాభి సవాల్.. ఏ విషయంలో అంటే

మంచి వెనకే చెడు.. అంతా డైవర్ట్‌ కోసమేనా?.. వర్మ అనుమానాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2025 | 03:59 PM