Pattabhi Challenged Jagan: జగన్‌కు పట్టాభి సవాల్.. ఏ విషయంలో అంటే
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:54 AM
అన్ని ఆధారాలతోనే జోగి రమేష్‌ను నకిలీ మద్యం కేసులో అరెస్టు చేయడం జరిగిందని పట్టాభి వెల్లడించారు. వైసీపీ నకిలీ మద్యం వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక రకమైన కొత్త గ్రామాలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెరలేపుతున్నారని ఆరోపించారు.
చిత్తూరు, నవంబర్ 3: మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి (Swachh Andhra Aorporation Chairman Pattabhi) ఫైర్ అయ్యారు. వైసీపీ నుంచి జోగి రమేష్‌ను సస్పెండ్ చేయగలవా అంటూ జగన్‌కు సవాల్ విసిరారు. మొలకలచెరువు మద్యం కేసులో టీడీపీకి చెందిన జయ చంద్రారెడ్డిపై ఆరోపణ వచ్చిన వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని గుర్తుచేశారు. టీడీపీకి, వైసీపీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇది అని అన్నారు. అన్ని ఆధారాలతోనే జోగి రమేష్‌ను నకిలీ మద్యం కేసులో అరెస్టు చేయడం జరిగిందని వెల్లడించారు. వైసీపీ నకిలీ మద్యం వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక రకమైన కొత్త గ్రామాలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు.
నకిలీ మద్యం వ్యవహారంలో వైసీపీ కోట్ల రూపాయలు దండుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. అద్దేపల్లి సోదరులతో జోగి రమేష్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు వాట్సాప్ చాటింగ్‌లు నిజం కావా అంటూ నిలదీశారు. విదేశాల్లో నడిపిన నకిలీ మద్యం వ్యవహారాన్ని ఏపీలోనూ ఇక్కడ వారికి ట్రైనింగ్ ఇచ్చి నకిలీ మద్యం తయారు చేయడం నిజం కాదా అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబం కమీషనల్లోని నకిలీ మద్యం వ్యవహారం మొత్తం కూడా సాగింది నిజం కాదా అంటూ జగన్‌మోహన్ రెడ్డిపై పట్టాభి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇవి కూడా చదవండి...
చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, లోకేష్ సంతాపం
జోగి రమేష్ కుటుంబసభ్యులు, అనుచరులపై కేసు నమోదు
Read Latest AP News And Telugu News