Share News

Chandrababu Lokesh Chevella Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, లోకేష్ సంతాపం

ABN , Publish Date - Nov 03 , 2025 | 10:23 AM

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Chandrababu Lokesh Chevella Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, లోకేష్ సంతాపం
Chandrababu Lokesh Chevella Accident

అమరావతి, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై (Chevella Road Accident) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu), ఐటీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పందిస్తూ... మృతులకు సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం, మంత్రి తెలిపారు.


కలచివేసింది: చంద్రబాబు

‘తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.


లోకేష్ ట్వీట్...

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో పలువురు మృత్యువాత పడటం హృదయం ధ్రవించిపోయింది. మృతులకు అశ్రు నివాళులు అర్పిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.


కాగా.. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరికాసేపట్లో మృతదేహాలను పోస్టుమార్టం పూర్తికానుంది. ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో ఉన్నలారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట 17 మంది చనిపోయినట్లు సమాచారం రాగా... ఆ తరువాత మృతుల సంఖ్య పెరిగి 20కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మృతుల కుటుంబసభ్యులు చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి చేరుకుంటున్నారు. తమ వారి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

జోగి రమేష్ కుమారుడుపై కేసు నమోదుకు రంగం సిద్ధం..

చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2025 | 10:42 AM