Road Accident: చేవెళ్ల ఘటన.. గుండెను పిండేసే దృశ్యాలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 09:59 AM
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు పలు హృదయాలను కలిచివేస్తున్నాయి. వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
చేవెళ్ల, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు పలు హృదయాలను కలిచివేస్తున్నాయి. వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఘటన సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలు చేయడం గుండెను పిండేసేవిగా ఉన్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు.
ఇవి కూడా చదవండి:
Nacharam Murder: ఖమ్మంలో మహిళ, నాచారంలో వ్యక్తి దారుణ హత్య
Inter Board: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు