Nacharam Murder: ఖమ్మంలో మహిళ, నాచారంలో వ్యక్తి దారుణ హత్య
ABN , Publish Date - Nov 03 , 2025 | 09:38 AM
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. స్థానిక పారిశ్రామికవాడలో ఉన్న ఒక పరిశ్రమ దగ్గర రక్తపు మడుగులో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని చూసిన స్థానికులు..
హైదరాబాద్, నవంబర్ 3: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న ఒక పరిశ్రమ దగ్గర రక్తపు మడుగులో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హత్యకు గురైన వ్యక్తి ఉప్పల్ కళ్యాణ్ పూరికి చెందిన మురళీకృష్ణ గా గుర్తించారు.
మృతుడు మురళీకృష్ణ కూలి పనులు చేస్తుండగా, ఆయన భార్య కళ్యాణ్ పూరిలోని ఓ ఇంట్లో కేర్ టేకర్ గా పని చేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించి, హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
మరో ఘటనలో ఖమ్మం జిల్లా ముత్తగూడెంలో మహిళ హత్యకు గురయ్యింది. మృతురాలిని గునిగంటి నాగమణి(48)గా గుర్తించారు. మహిళను బంధువులే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు