Two IAS Coaching Institutes: మరో రెండు ఐఏఎస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లపై సీసీపీఏ కొరడా.. రూ.8లక్షల చొప్పున ఫైన్
ABN , Publish Date - Nov 03 , 2025 | 05:27 AM
తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న మరో రెండు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) కొరడా ఝళిపించింది.
న్యూఢిల్లీ, నవంబరు 2: తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న మరో రెండు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) కొరడా ఝళిపించింది. తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసినందుకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అయిన దీక్షంత్ ఐఏఎస్, అభిమను ఐఏఎ్‌సలకు సీసీపీఏ రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించింది. తమ అనుమతి లేకుండా తమ పేర్లతో పాటు ఫొటోలను ఈ ఇన్‌స్టిట్యూట్లు వాడినట్టు యూపీఎస్సీలో విజయం సాధించిన అభ్యర్థులు చేసిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపట్టిన సీసీపీఏ చర్యలకు ఉపక్రమించింది. ఎక్కువ మంది ఎంపికైనట్టుగా చూపడానికి యూపీఎస్సీలో విజయం సాధించిన అభ్యర్థుల ఫొటోలు, పేర్లను వాడి చాలా మంది టాపర్లు తమ విద్యార్థులేనన్న అభిప్రాయం కలిగేలా ఈ ఇన్‌స్టిట్యూట్లు ప్రచారం చేసుకొన్నాయి.