Share News

Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు

ABN , Publish Date - Nov 03 , 2025 | 05:22 AM

భారత్‌లో అంటువ్యాధుల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్‌ నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంటువ్యాధుల....

Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు

న్యూఢిల్లీ, నవంబరు 2: భారత్‌లో అంటువ్యాధుల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్‌ నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంటువ్యాధుల వ్యాప్తి 10.7 శాతంగా నమోదవగా.. రెండో త్రైమాసికంలో ఇది 11.5 శాతానికి పెరిగింది. ఐసీఎంఆర్‌ అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా పరీక్షించిన ప్రతి 9 మందిలో ఒకరిలో సంక్రమిత వ్యాధికారకాలు ఉన్నట్టు తేలింది. ఐసీఎంఆర్‌ నెట్‌వర్క్‌ కింద ఉన్న ల్యాబ్‌ల్లో 4.5 లక్షల మందిని పరీక్షించగా 11.1 శాతం మందిలో వ్యాధికారక సూక్ష్మజీవులు ఉన్నట్టు కనుగొన్నారు. అక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌ (ఏఆర్‌ఐ) కేసుల్లో ఇన్‌ఫ్లుయెంజా-ఏ, తీవ్రమైన జ్వరం, రక్తస్రావం కేసుల్లో డెంగీ వైరస్‌, కామెర్ల కేసుల్లో హెపటైటి్‌స-ఏ, డయేరియా కేసుల్లో నోరోవైరస్‌, అక్యూట్‌ ఎన్సిఫాలిటిస్‌ సిండ్రోమ్‌ (ఏఈఎస్‌) కేసుల్లో హెర్పస్‌ సింప్లెక్స్‌ వైరస్‌ (హెచ్‌ఎ్‌సవీ)లను టాప్‌-5 వ్యాధికారకాలుగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి..

Two IAS Coaching Institutes: మరో రెండు ఐఏఎస్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్లపై సీసీపీఏ కొరడా.. రూ.8లక్షల చొప్పున ఫైన్‌

Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు

Updated Date - Nov 03 , 2025 | 07:07 AM