Inter Board: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 07:08 AM
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల పనితీరు మెరుగుపరచడంలో భాగంగా కాలేజీల్లో బోర్డు తనిఖీలు చేపట్టింది. ఈ నెల 15 వరకు తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించింది.
హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల పనితీరు మెరుగుపరచడంలో భాగంగా కాలేజీల్లో బోర్డు తనిఖీలు చేపట్టింది. ఈ నెల 15 వరకు తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,752 ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు, పరిపాలనా పరమైన నిబంధనలు అమలుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తనిఖీల్లో స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ సెక్రటరీలు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు (డీఐఈఓ) తమ పరిధిలోని కాలేజీలను తనిఖీ చేయనున్నారు. తనిఖీలు పూర్తయిను వెంటనే సమగ్ర తనిఖీ నివేదికను ఇంటర్ బోర్డు కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.
ప్రధానంగా పలు కీలక అంశాలను తనిఖీ చేయనున్నారు. ప్రైవేటు కాలేజీల్లో అఫ్లియేషన్ ఉన్నదా? లేదా?, విద్యార్థుల డేటా ఎంట్రీ సరిగ్గా రికార్డ్ చేస్తున్నారా? లేదా? అనే దానిని చెక్ చేయనున్నారు. ప్రభుత్వ కాలేజీలు కోచింగ్ క్లాసులు నడపడం, కాలేజీలు యూనిఫాం టైం టేబుల్ ఫాలో అవుతున్నాయా లేదా, సిలబస్ పూర్తయిందా, విద్యార్థుల హాజరు ఎంత శాతం ఉందనేది చెక్ చేస్తారు. ఇంటర్ ఎగ్జామ్స్ కు రెండు నెలలకుపై సమయం ఉన్నందున దీని ప్రకారం యాక్షన్ ప్లాన్ రూపొందించి సిలబస్ పూర్తి చేస్తున్నారా? లేదా? అనే అంశాలను పరిశీలించనున్నారు.
ఇవి కూడా చదవండి:
Doctors Renting Out Medical Certificates: అద్దెకు వైద్య పట్టాలు
CM Revanth Reddy: గెలుపు సునాయాసం