Jogi Ramesh: జోగి రమేష్ కుమారుడిపై కేసు నమోదుకు రంగం సిద్ధం..
ABN , Publish Date - Nov 03 , 2025 | 08:26 AM
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడుపై కేసు నమోదు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడుపై కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధం అయ్యారు. నిన్న(ఆదివారం) ప్రభుత్వ ఆసుపత్రిలో జోగి రమేష్‌ను హాజరు పరిచే సమయంలో ఆయన కుమారుడు వైసీపీ అనుచరులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో.. వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. అనంతరం ఆసుపత్రి అద్దాలు, తలుపులను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు.
అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జోగి రమేష్ కుమారుడు ఆయన అనుచరులపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఆయన సోదరుడు జోగి రాముకు ఈనెల 13వ తేదీ వరకు కోర్డు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని విజయవాడ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు