Jogi Ramesh Family Case: జోగి రమేష్ కుటుంబసభ్యులు, అనుచరులపై కేసు నమోదు
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:22 AM
ఆస్పత్రి వద్ద జోగి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో ఆస్పత్రి అద్దాలను జోగి అనుచరులు ధ్వంసం చేశారు.
విజయవాడ, నవంబర్ 3: మాజీ మంత్రి జోగి రమేష్ (Former Minister Jogi Ramesh) కుటుంబసభ్యులు, అనుచరులపై కేసు నమోదు అయ్యింది. నిన్న (ఆదివారం) విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జోగి అనుచరులు హడావుడి చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రభుత్వాస్పత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌లో జోగి కుటుంబసభ్యులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ కుటుంబసభ్యులపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదు అయ్యింది.
కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు ఈనెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో వారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. జోగిని ఆస్పత్రికి తరలించిన సమయంలో ఆయన అనుచరులు భారీగా అక్కడకు చేరుకున్నారు. అనుచరులతో కలిసి భార్య శకుంతల, కుమారులు రాజీవ్, రోహిత్ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి వద్ద జోగి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో ఆస్పత్రి అద్దాలను జోగి అనుచరులు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసులు జోగి కుటుంబసభ్యులు, అనుచరులపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసును నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి
చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, లోకేష్ సంతాపం
Read Latest AP News And Telugu News