Share News

Varma Questions: మంచి వెనకే చెడు.. అంతా డైవర్ట్‌ కోసమేనా?.. వర్మ అనుమానాలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 01:41 PM

డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని దురుద్దేశంతో చేస్తున్నారా అని ప్రశ్నించారు.

Varma Questions: మంచి వెనకే చెడు.. అంతా డైవర్ట్‌ కోసమేనా?.. వర్మ అనుమానాలు
Varma Questions

కాకినాడ, నవంబర్ 3: ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో ముందుకు వెళుతుంటే జగన్ అండ్ టీం వాటిని డైవర్ట్ చేస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ (Pithapuram Former MLA Varma) ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కర్నూలులో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సభ హిట్ అయిన వెంటనే సింహాచలంలో గోడ కూలిపోయిందని తెలిపారు. మొంథా తుపాన్ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తమైందని.. ఆ వెంటనే శ్రీకాకుళం ఆలయంలో ప్రమాదం జరిగిందని అన్నారు. చంద్రబాబు మంచి పని ప్రజల్లోకి వెళుతుంటే వెంటనే ఇన్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని.. ఇటువంటి ఘటనలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని.. వీటిపై డీజీపీ విచారణ జరపాలని కోరారు.


డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని దురుద్దేశంతో చేస్తున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నిమిషంలో ఫీల్డ్‌లో దిగారని... జగన్ మాత్రం ప్యాలెస్‌లోనే కూర్చున్నారని విమర్శించారు. సీఎం రిస్క్ చేసి మరీ ఫీల్డ్‌కు వచ్చారని తెలిపారు. జగన్ ఇప్పటి వరకు ప్యాలెస్ నుంచి ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. తుపానుపై సీఎం చంద్రబాబు అడుగడునా అప్రమత్తమై పనిచేశారని తెలిపారు. గత ఐదేళ్లలో సీఎంగా జగన్ రాష్ట్రానికి ఏం వెలగబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. విపత్తుల సమయంలో జగన్ ఎప్పుడైనా పర్యటించారా.. గాలిలో తిరగడం తప్ప ఏం చేశారంటూ ఫైర్ అయ్యారు. కష్టం వస్తే చంద్రబాబు 5 నిమిషాల్లో అక్కడ ఉంటున్నారని తెలిపారు. గత వైసీపీ హయాంలో ఐదు ప్రకృతి విపత్తులు వచ్చాయని.. అయినా ఏనాడు ప్రజలను ఆదుకోలేదని దుయ్యబట్టారు. 30 వేల కోట్లు రైతుల నష్టపోతే మీరు ఇచ్చింది కేవలం రూ.2 వేలు కోట్లు మాత్రమే అంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

జోగి రమేష్ కుటుంబసభ్యులు, అనుచరులపై కేసు నమోదు

జగన్‌కు పట్టాభి సవాల్.. ఏ విషయంలో అంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2025 | 01:52 PM