Share News

లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన.. ఒలింపిక్ సైట్‌ల సందర్శన

ABN , Publish Date - Feb 03 , 2026 | 10:40 AM

అమరావతి నిర్మాణంలో పలు ప్రాజెక్టుల అభివృద్ధి కోసం మంత్రి నారాయణ బృందం లండన్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా, 2012లో లండన్‌లో ఒలింపిక్ క్రీడలు జరిగిన ప్రాంతాలను ఈ బృందం పరిశీలించనుంది.

లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన.. ఒలింపిక్ సైట్‌ల సందర్శన
Minister Narayana

అమరావతి, ఫిబ్రవరి 3: లండన్‌లో మంత్రి నారాయణ (Minister Narayana) బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా పలు కీలక ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించి ఆధునిక నమూనాలను అధ్యయనం చేసేందుకు మంత్రి లండన్ వెళ్లారు. మంగళవారం లండన్‌లోని పలు ప్రాంతాలను మంత్రి బృందం సందర్శించనుంది. ప్రధానంగా 2012 ఒలింపిక్ క్రీడలు జరిగిన ప్రాంతాలను పరిశీలించనున్నారు నారాయణ. అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే స్థాయిలో కూటమి సర్కార్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, మధ్యాహ్నం కింగ్స్ క్రాస్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను సందర్శించి అభివృద్ధి మోడల్‌ను మంత్రి అధ్యయనం చేయనున్నారు.


ఇక, సోమవారం థేమ్స్ నది ఒడ్డున ఉన్న పలు టూరిజం ప్రాజెక్టులను అధ్యయనం చేసింది మంత్రి బృందం. థేమ్స్ నది ఒడ్డున ఐకానిక్ భవనాలు, బోటింగ్ సౌకర్యాలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పర్యాటకులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని మంత్రి నారాయణ ప్రశంసించారు. అమరావతిలో కూడా కృష్ణా నది ఒడ్డున ఇలాంటి రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టులు అమలు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ గ్విన్ రిచర్డ్స్‌తో సమావేశమై మాస్టర్ ప్లాన్, రవాణా సౌకర్యాలు, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.


ఫిబ్రవరి 2న మంత్రి నారాయణ బృందం లండన్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు లండన్, దోహాలో ఈ బృందం పర్యటన కొనసాగనుంది. మంత్రి వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGIC) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

మున్సిపల్ టికెట్ల అంశం.. జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్

కేసీఆర్ మెడలు వంచింది నేనే.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 12:02 PM