మున్సిపల్ టికెట్ల అంశం.. జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్
ABN , Publish Date - Feb 03 , 2026 | 09:47 AM
మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీ విషయంలో రాష్ట్ర మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డుల్లో.. 29 టికెట్లు ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ వర్గానికి, 21 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి కాంగ్రెస్ అధిష్ఠానం కేటాయించినట్లు సమాచారం.
జగిత్యాల, ఫిబ్రవరి 3: కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి జీవన్ రెడ్డి(Jeevan Reddy) మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీట్ల పంపకంలో.. తన గొంతు కోశారని, కాంగ్రెస్ అధిష్ఠానం తన వర్గానికి న్యాయం చేయలేదని అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా.. 29 టికెట్లు ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ వర్గానికి, 21 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి పార్టీ అధిష్ఠానం కేటాయించినట్లు సమాచారం. ఈ అంశం జీవన్ రెడ్డి వర్గంలో మరింత అసంతృప్తిని పెంచినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏడాదిన్నర కాలంగా సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన సంజయ్‌కు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంపై జీవన్ రెడ్డి గతంలోనే ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు టికెట్ల అంశంతో ఆ విభేదాలు మరింత ముదిరినట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీ టికెట్ల కేటాయింపులో జీవన్ రెడ్డి రియాక్షన్‌పై జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంప్ ఆఫీస్ వద్ద భద్రతా ఏర్పాట్లు పెంచారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి భవిష్యత్తు క్లైమాక్స్‌కు చేరుకుందనే చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి...
కేసీఆర్ మెడలు వంచింది నేనే.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
అనంతపురంలో ఘోరం.. ఆస్తి తగాదాలతో తల్లీకొడుకుల దారుణ హత్య
Read Latest Telangana News And Telugu News