Share News

London Visit: లండన్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. పారిశ్రామిక దిగ్గజాలతో

ABN , Publish Date - Nov 03 , 2025 | 02:37 PM

లండన్‌లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.

London Visit: లండన్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. పారిశ్రామిక దిగ్గజాలతో
London Visit

యూకే/అమరావతి, నవంబర్ 3: వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం బిజీబిజీగా గడుపనున్నారు. వ్యక్తిగత పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. లండన్‌లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీకానున్నారు. ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జర్లాడ్‌తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం హిందుజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందుజా, యూరోప్‌లోని హిందుజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా రెన్యువబుల్స్ ఫౌండర్ శోమ్ హిందుజాలతో భేటీ అవుతారు. రోల్స్ రాయస్ గ్రూప్ సీటీఓ నిక్కి గ్రేడి స్మిత్‌‌ను ముఖ్యమంత్రి కలువనున్నారు. అలాగే ఎస్రామ్, ఎమ్రామ్ గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరనందానీతోనూ భేటీ అవుతారు.


ఆపై శామ్కో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయతో సీఎం సమావేశమవుతారు. అనంతరం లండన్‌లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. సీఐఐ రౌండ్ టేబుల్ సమావేశానికి బ్రిటిష్ హెల్త్ టెక్ పరిశ్రమల అసోసియేషన్ ఎండీ పాల్ బెంటన్, ఏఐపాలసీ ల్యాబ్, ఫిడో టెక్,పీజీ పేపర్ కంపెనీ, నేషనల్ గ్రాఫైన్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు హాజరుకానున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో లండన్‌లోని భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి భేటీ కానున్నారు.


కాగా.. లండన్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రెండు అవార్డులను అందుకోనున్నారు. 4న ప్రతిష్ఠాత్మక సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌(ఐవోడీ) నుంచి భువనేశ్వరి రెండు అవార్డులు అందుకోనున్నారు. డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌ 2025 అవార్డును ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ హోదాలో, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగంలో గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును హెరిటేజ్‌ ఫుడ్స్‌ వీసీ, ఎండీ హోదాలో భువనేశ్వరి స్వీకరించనున్నారు.


ఇవి కూడా చదవండి...

జగన్‌కు పట్టాభి సవాల్.. ఏ విషయంలో అంటే

మంచి వెనకే చెడు.. అంతా డైవర్ట్‌ కోసమేనా?.. వర్మ అనుమానాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2025 | 03:16 PM