Share News

Vizag Steel Plant: వికసిత భారత్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు..

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:59 PM

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో డిసెంబర్ నెలలో మిట్టల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ జరగబోతోందని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారతదేశం నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు.

Vizag Steel Plant: వికసిత భారత్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు..
Bhupathiraju-Srinivasa-Varma

అనకాపల్లి: భారత దేశ ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమలే కీలకమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఇక్కడి ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగిస్తామని తెలిపారు.

విశాఖ ఉక్కును గాడిలో పెట్టడానికి, పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.1140 కోట్ల ప్యాకేజీ అందించిందని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో వికసిత భారత్ లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు.


అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో డిసెంబర్ నెలలో మిట్టల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ జరగబోతోందని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారతదేశం నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ 7.3 టన్నుల సామర్థ్యంతో పని చేస్తుందన్నారు. నక్కపల్లిలో ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్ తొలి దశలోనే 17 టన్నుల సామర్థ్యంతో పని చేస్తోందని వివరించారు. 2029 నాటికి నక్కపల్లి స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయిలోకి అందుబాటులోకి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. నక్కపల్లిలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సంబంధించి సంవత్సరంలోపే అన్ని అనుమతులు మంజూరు చేసామని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Two IAS Coaching Institutes: మరో రెండు ఐఏఎస్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్లపై సీసీపీఏ కొరడా.. రూ.8లక్షల చొప్పున ఫైన్‌

Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు

Updated Date - Nov 03 , 2025 | 01:15 PM