Share News

Chandrababu Naidu, London Visit: లండన్‌లో భారత హైకమిషనర్‌తో బాబు భేటీ..

ABN , Publish Date - Nov 04 , 2025 | 08:43 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్‌ పర్యటన కొనసాగుతోంది. పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడుల వేట అక్కడ కూడా కొనసాగిస్తున్నారు.

Chandrababu Naidu, London Visit: లండన్‌లో భారత హైకమిషనర్‌తో బాబు భేటీ..
chandrababu naidu london visit

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్‌ పర్యటన కొనసాగుతోంది. పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడుల వేట అక్కడ కూడా కొనసాగిస్తున్నారు. లండన్‌లో అనేకమంది దిగ్గజాలతో భేటీ అవుతున్నారు. తాజాగా భారత హైకమిషనర్ శ్రీ విక్రమ్ దొరైస్వామితో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ - యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, విద్యా సహకారం, ఆవిష్కరణలు, ప్రవాస భారతీయులతో మమేకమై రాష్ట్రానికి మేలు జరిగేలా చూడ్డం తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం.

CM-in-London.jpg


ఈ సమావేశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, యుకెతో సహకారంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. ఈ చర్చలు ఏపీలో ఆర్థిక అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు తగిన తోడ్పాటునిచ్చేలా సాగాయి. భేటీకి ముందు, హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓటర్ల సమస్యకు సత్వర పరిష్కారం

అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 04 , 2025 | 08:53 AM