Weight Loss: డైట్ రూల్‌తో 99 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గిన మహిళ.. ఇన్‌స్పైరింగ్ స్టోరీ
ABN , Publish Date - Jan 13 , 2026 | 08:51 PM
బరువు తగ్గాలని చాలా మంది తపిస్తుంటారు. అయితే.. ప్రయత్న లోపాలతో అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఒక పార్టీలో ఆమెకు ఎదురైన ఇబ్బందితో గట్టి నిర్ణయం తీసుకున్న ఓ మహిళ కేవలం ఏడాదిలో ఏకంగా 38 కిలోల బరువు తగ్గి తానేంటో నిరూపించుకున్నారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 13: ఇంగ్లాండ్(UK)కు చెందిన 29 ఏళ్ల లూయిస్ గాఫ్(Louise Gough) అనే బిజినెస్ ఉమెన్.. తాను బరువు తగ్గిన విధానాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. గతంలో 99 కిలోల బరువున్న ఆమె.. కేవలం ఒక సంవత్సరంలోనే 38 కిలోలు తగ్గి 60 కిలోలకు చేరుకున్నారు. ఆమె అనుసరించిన ఒకే సింపుల్ డైట్ రూల్ 80/20 ప్రిన్సిపుల్. రోజులో 80 శాతం భోజనం పూర్తిగా హెల్తీ, న్యూట్రిషియస్ ఫుడ్స్(ప్రోటీన్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్ వంటివి) మిగిలిన 20 శాతం ఇష్టమైన ట్రీట్స్, స్వీట్స్ లేదా ఫేవరెట్ ఫుడ్స్ తీసుకున్నారు. తాను అనుసరించిన ఆహార నియమాల్ని క్రమశిక్షణతో పాటిస్తూ క్రమబద్దంగా డైట్ కొనసాగించగలిగారామె.
ఇతర ముఖ్యమైన అలవాట్లు:
క్యాలరీ & మ్యాక్రోన్యూట్రియెంట్స్ ట్రాక్ చేసి క్యాలరీ డెఫిసిట్‌లో ఉండటం(మొదట్లో రోజుకు సుమారు 1,800 క్యాలరీలు)
రోజుకు 8,000 – 10,000 అడుగుల నడక
ఆల్కహాల్, టేక్‌అవే ఫుడ్ పూర్తిగా మానేయడం
జిమ్ వర్కౌట్స్ + రన్నింగ్
దీంతో అనూహ్యంగా ఆమె.. తాను ఎలా ఉండాలనుకున్నారో అలాంటి స్థితికి వచ్చేశారు. బరువు తగ్గడం వల్ల ఆమె చర్మం కూడా తేజోవంతమైందట. జుట్టు మందంగా, బలంగా మారడం సహా ఎనర్జీ లెవల్స్ కూడా పెరిగాయని తెలిపారు. ఇప్పుడు జంక్ ఫుడ్ తినాలనే కోరికలూ దాదాపు లేవని ఆమె చెప్పుకొచ్చారు. 'నేను నా జీవితాన్ని పూర్తిగా మార్చుకోగలిగానని చాలా గర్వంగా ఉంది. రోజూ హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతున్నా' అని లూయిస్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News