Drinking Water After Eating: తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
ABN , Publish Date - Jan 08 , 2026 | 01:01 PM
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం చాలా మందికి అలవాటు. కానీ ఈ చిన్న అలవాటే జీర్ణక్రియను బలహీనపరచి, గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆహారం, నీరు రెండూ మన ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ, వాటిని సరైన సమయంలో తీసుకోవడం ముఖ్యం. చాలా మందికి భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ అలవాటు జీర్ణక్రియకు మంచిది కాదు. దీని వల్ల కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మన శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికి ప్రత్యేక జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది. తిన్న వెంటనే నీరు తాగితే ఈ రసాలు నీరుగా మారి, వాటి పని సరిగ్గా జరగదు. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
తిన్న తర్వాత ఎంతసేపటికి నీళ్లు తాగాలి?
నిపుణుల ప్రకారం, భోజనం చేసిన 30 నుంచి 45 నిమిషాల తర్వాత నీరు తాగడం మంచిది. భోజనం చేసే ముందు నీరు తాగాలనుకుంటే, అరగంట ముందు తాగాలి. ఇలా చేస్తే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది, శరీరానికి పోషకాలు బాగా చేరుతాయి.
తిన్న వెంటనే నీళ్లు తాగితే వచ్చే సమస్యలు
జీర్ణక్రియ బలహీనపడుతుంది: ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వస్తాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి పూర్తిగా అందవు. దీని వల్ల బలహీనత, అలసట రావొచ్చు.
కడుపు బరువుగా అనిపిస్తుంది: నీరు తాగడంతో కడుపు ఉష్ణోగ్రత తగ్గి, ఆహారం ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీంతో ఉబ్బరం, అసిడిటీ సమస్యలు పెరుగుతాయి.
బరువు పెరిగే అవకాశం: ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే కొవ్వు పేరుకుపోయి, మెటబాలిజం నెమ్మదిస్తుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటే, దాన్ని మెల్లగా మార్చుకోవాలి. 30–45 నిమిషాల గ్యాప్ తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న మార్పే అయినా.. దీని వల్ల పెద్ద లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
ఆఫీసులో ఈ 4 రకాల వ్యక్తులు ఎక్కువగా నష్టపోతారు..
For More Latest News