Chanakya Niti Career Advice: ఆఫీసులో ఈ 4 రకాల వ్యక్తులు ఎక్కువగా నష్టపోతారు..
ABN , Publish Date - Jan 06 , 2026 | 10:15 AM
చాలా మంది ఆఫీసులో కష్టపడి పని చేస్తారు, నైపుణ్యం కూడా ఉంటుంది. అయినా సరే పదోన్నతి రావడం లేదు అని బాధపడుతుంటారు. అదే సమయంలో, మనకంటే తక్కువ అర్హతలు ఉన్నవారు ఎదుగుతూ ఉండటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే, ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించారా?
ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసులో కష్టపడి పనిచేస్తున్నా సరే ఎదుగుదల లేకపోతే అది నిరాశ కలిగించే విషయం. అదే సమయంలో మనకంటే తక్కువ అర్హతలు ఉన్నవారు ప్రమోషన్లు పొందుతూ ఉండటం చూసి ఆశ్చర్యం కలుగుతుంది. చాలా మంది బాస్‌తో మంచి సంబంధం లేకపోవడం వల్లే తమకు ప్రమోషన్లు రాలేదని అనుకుంటారు. కానీ చాణక్య నీతి ప్రకారం, అసలు కారణం మన స్వభావం, అలవాట్లే. కొన్ని అలవాట్లు ఆఫీసులో మన ఎదుగుదలకు అడ్డంకిగా మారతాయి. అలాంటి 4 రకాల వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బలహీనతలను అందరికీ చెప్పుకునే వారు
ఆఫీసులో తమ సమస్యలు, భయాలు, బలహీనతలను అందరికీ చెప్పడం పెద్ద తప్పు అని చాణక్యుడు చెప్పారు. కొందరు వాటిని తమ లాభానికి వాడుకుంటారు. దీని వల్ల మన ప్రతిష్ట దెబ్బతింటుంది, నమ్మకం తగ్గుతుంది.
ప్రతి విషయంపై వాదించే వారు
అనవసరంగా ఎక్కువగా మాట్లాడటం, ప్రతి మీటింగ్‌లో వాదించడం మంచిది కాదు. ప్రతి విషయంపై తమ అభిప్రాయం చెప్పాల్సిందే అనుకునే వారిని అధికారి క్రమశిక్షణ లేనివారిగా భావిస్తారు. దీని వల్ల పదోన్నతులపై ప్రభావం పడుతుంది.
భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకునే వారు
కోపం, భయం లేదా తొందరపాటు వల్ల తీసుకునే నిర్ణయాలు కెరీర్‌కు హానికరం కావచ్చు. భావోద్వేగాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకునే వారు తర్వాత వాటికి పశ్చాత్తాపపడే పరిస్థితి వస్తుంది.
తమను తాము చూపించుకోలేని వారు
కష్టపడి పని చేయడం మాత్రమే సరిపోదు. మన పని, విజయాలు సరైన సమయంలో సరైన విధంగా తెలియజేయాలి. చాలామంది బాగా పని చేస్తారు కానీ తమ ప్రయత్నాలను బయటికి చూపించలేరు. ఫలితంగా వారి కష్టం గుర్తించబడకుండా పోతుంది. చాణక్య నీతి ప్రకారం, ఆఫీసులో ఎదగాలంటే కేవలం కష్టం కాదు, తెలివి, సమయస్ఫూర్తి, సరైన ప్రవర్తన కూడా అవసరం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
కీరదోసకాయ వీరు అస్సలు తినొద్దు.. ఎందుకంటే..!
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News