Share News

Health Tips: కీరదోసకాయ వీరు అస్సలు తినొద్దు.. ఎందుకంటే..!

ABN , Publish Date - Jan 05 , 2026 | 07:50 AM

కీరదోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినడం వలన శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇందులోని పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే, కొందరికి మాత్రం ఇవి కీడు చేస్తాయట.. పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు కీరను తినొద్దట.. మరి ఎవరు తినొద్దు.. తింటే ఏమవుతుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Health Tips: కీరదోసకాయ వీరు అస్సలు తినొద్దు.. ఎందుకంటే..!
Cucumber health risks

కీర దోసకాయ.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతుంటారు. అందుకే.. చాలా మంది కీరను తింటుంటారు. సలాడ్ రూపంలో, రైతా రూపంలో, జ్యూస్ రూపంలో ఇలా రకరకాలుగా తింటుంటారు. కీర దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. ఫలితంగా దీనిని తింటే.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. పైగా బరువు తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగు పరచడంలోనూ అద్భుతంగా పని చేస్తుంది. ఇక కీరదోసకాయలో విటమిన్ కే, విటమిన్ సి, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యక్తి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఇంతటి ఆరోగ్యకరమైన కీర.. కొందరికి మాత్రం దుష్ప్రభావం చూపుతుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. కీరను తినడం మంచిదని కాదని.. మరింత అనారోగ్యానికి కారణమవుతుందని చెబుతున్నారు. మరి కీర దోసకాయను ఎవరు తినకూడదు.. తింటే ఏమవుతుంది.. వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


జీర్ణ సమస్యలు ఉంటే..

ఆయుర్వేదం ప్రకారం.. కీరదోసకాయ ఎక్కువగా తింటే జలుబు సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఉబ్బసం, జలుబు, దగ్గు, కఫం, సైనస్, వాత దోషం సమస్యలు ఉన్నవారు కీరదోసకాయ తినకపోవడమే ఉత్తమం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. కీరదోసకాయ అతిగా తినడం వల్ల వాత దోషం పెరుగుతంది. టున్నారు. ఇప్పటికే కీళ్ల నొప్పులతో బాధపడేవారు కీరదోసకాయ తినొద్దని హెచ్చరిస్తున్నారు. కీరలో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ.. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఇది కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తుంది.


అతిమూత్ర సమస్యలతో బాధపడేవారు కీరదోసకాయను తక్కువగా తినాలి. కీరలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల దీనిని తింటే.. తరచుగా మూత్రవిసర్జన వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కీరదోసకాయ సాధారణంగా మధుమేహం ఉన్నవారికి సురక్షితమైనవిగా భావిస్తారు. అయితే, కీరలోని గింజలు.. ఇన్సులిన్, గ్లూకోజ్ తగ్గించే మెడిసిన్స్ వేసుకునే వారికి ఇబ్బంది కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కీరదోసక తినడం వలన సాధారణంగానే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాంటి సమయంలో ఈ మెడిసిన్స్ వాడేవారు కూడా కీరను తింటే.. షుగర్ లెవల్స్ ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. ఇక భోజనం చేసిన తరువాత ఎక్కువగా కీరదోసకాయ తినొద్దని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే.. ఇవి జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుందని.. ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బరంగా అనిపించడం, అసౌకర్యంగా అనిపిస్తుంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


Disclaimer: పైన పేర్కొన్న వివరాలు ఆయుర్వేద నిపుణులు అందించిన సమాచారం, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించడం ఉత్తమం.


Also Read:

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా జడేజా!

బెంగళూరులో దారుణం.. ఓం శక్తి మాలధారులపై రాళ్ల దాడి

వెనుజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..

Updated Date - Jan 05 , 2026 | 07:50 AM