Share News

Health: సమతుల ఆహారంతోనే ఆరోగ్యం..

ABN , Publish Date - Jan 06 , 2026 | 10:34 AM

సమతుల ఆహారంతోనే ఆరోగ్యం అని, అధిక కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు, నూనెలతో ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే.. మారుతున్న జీవన శైలిలో మార్పులు తప్పనిసరి అని తెలుపుతున్నారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ ఉండకూడదని సూచిస్తున్నారు.

Health: సమతుల ఆహారంతోనే ఆరోగ్యం..

- అధిక కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు, నూనెలతో ప్రమాదం

- మారుతున్న జీవన శైలిలో మార్పులు తప్పనిసరి

- వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

హైదరాబాద్‌ సిటీ: నగరీకరణకు తోడు మనం తీసుకునే ఆహార విధానాల పరంగా జీవనశైలిలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. కార్బోహైడ్రేట్స్‌, చక్కెర, అధిక కొవ్వు కలిగిన ఆహారాలను తీసుకోవడంతో వివిధ రకాల వ్యాధులు పెరిగిపోతున్నాయి. కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇటీవల విడుదల చేసిన అధ్యయనంలో భారతీయుల్లో గుండె జబ్బులు, క్యాన్సర్‌ సంబంధిత వ్యాధుల కోసం అధికంగా క్లెయిమ్‌లు వస్తున్నాయంటుండటం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నట్లే! మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలతోనే చాలా వరకు జబ్బులను దరికి రానీయకుండా చేయవచ్చంటున్నారు డాక్టర్లు, న్యూట్రిషియనిస్టులు. డైట్‌ ప్రణాళికను రూపొందించుకోవాలని, సమతుల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరానికి శక్తిని అందించడానికి, మజిల్‌ నిర్మాణంలో కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌ ఉన్న పదార్థాలు రోజూ కొద్ది పరిమాణంలో తీసుకోవాలని చెబుతున్నారు.


బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ ఎలా తీసుకోవచ్చంటే..

మన శరీరానికి అవసరమైన కేలరీలను విభజించుకుని కొద్దికొద్దిగా తీసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చంటున్నారు న్యూట్రిషియనిస్టు సమత. ఇంకా ఆమె పలు సూచనలు చేశారు.

- అల్పాహారంలో తాజా పండ్లు, బాదం లాంటి గింజలు, ఓట్‌ మీల్‌, ఇడ్లీ, కూరగాయలతో చేసిన పోహా, మల్టీ గ్రెయిన్‌ పరాటా వంటివి తీసుకోవచ్చు.

- లంచ్‌కు, అల్పాహారానికి మధ్య.. చిన్న ఆపిల్‌, అరటి పం డు, మిక్స్‌డ్‌ నట్స్‌, సీజనల్‌ ఫ్రూట్‌ ఏదైనా తీసుకోవచ్చు.


city8.2.jpg

- మధ్యాహ్న భోజనంలో పప్పు, మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ కర్రీ, బ్రౌన్‌ రైస్‌ లేదంటే రోటీ, పన్నీర్‌ కర్రీ, మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ సలాడ్‌ తీసుకోవచ్చు. మాంసాహారులు గ్రిల్డ్‌ చికెన్‌ లాంటివి కొద్ది పరిమాణంలో తీసుకోవచ్చు.

- ఈవెనింగ్‌ స్నాక్‌గా.. కొద్దిగా బాదంగింజలు, గ్రీన్‌టీ, ఫ్రూ ట్‌ స్మూతీ, మజ్జిగ, వేరుశనగలు వంటివి తీసుకోవచ్చు.

- రాత్రి భోజనంలో 7 గంటలకు ముందుగానే డిన్నర్‌ పూర్తి చేయడం మంచిది. వీలైనంత తేలికపాటి ఆహారం ఉండాలి. నాన్‌వెజ్‌ వారు గ్రిల్డ్‌ ఫిష్‌ లాంటివి, శాకాహారులు బ్రెడ్‌, వెజిటేబుల్‌ సూప్‌ లాంటివి ప్రయత్నించవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..

బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేశారా..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 06 , 2026 | 10:34 AM