Amaravati Development: రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం...
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:19 PM
త్రీ మెన్ కమిటీ నిర్ణయం ప్రకారం తిరిగి లంక భూముల విషయంలో 356కు గాను 79 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. మిగిలిన వారిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోమని కోరారు.
అమరావతి, డిసెంబ్ 27: రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఆర్డీఏ కార్యాలయంలో త్రీ మెన్ కమిటీ ఈరోజు (శనివారం) సమీక్ష నిర్వహించింది. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani Chandrasekhar) మీడియాతో మాట్లాడుతూ.. జరీబు భూ సమస్యలపై సర్వే పూర్తయిందన్నారు. జరీబు భూములపై జెన్యూన్‌గా ఎవరికి ఇవ్వాలి అనేదానిపై కమిటీ రిపోర్ట్ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. పది సెంట్లు కంటే తక్కువ ప్లాట్లు ఉన్నవాళ్లు 415 మంది ఉన్నారని... వారి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నామన్నారు. 2013 కంటే ముందు భూములు ఇచ్చిన రైతులు కూడా తమను ల్యాండ్ పూలింగ్ కింద పరిగణించమని అడుగుతున్నారని... కానీ అవి చట్టపరంగా సాధ్యం కావడం లేదని కేంద్రమంత్రి అన్నారు.
వీధి పోటు భూములకు సంబంధించి సుమారు 150 ఉన్నాయని.. వీధి పోటుకు సంబంధించి మరో రెండు అంశాలు రైతుల కోరుతున్నారని. ఆ అంశాలను తర్వాత పరిగణిస్తామని స్పష్టం చేశారు. త్రీ మెన్ కమిటీ నిర్ణయం ప్రకారం తిరిగి లంక భూముల విషయంలో 356కు గాను 79 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. మిగిలిన వారిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోమని కోరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమస్యలపై కూడా ఈ రివ్యూలో చర్చించినట్లు తెలిపారు. లార్జ్ రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని.. పరిష్కారం దిశగా వర్క్ చేస్తున్నామన్నారు.
హెల్త్ కార్డ్స్, పెన్షన్లు తదితర అంశాలపై కూడా చర్చించినట్లు చెప్పారు. స్థానికంగా 1596 మందిని క్యాపిటల్ వర్క్స్‌లో అధికారులు జాయిన్ చేసుకున్నారని.. ఇవి కాకుండా మరో 10 వేల మందిని రాజధానిలో ఉండే స్థానికులను కలిపే విధంగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను జనవరి 1 నుంచి ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నామన్నారు. పెండింగ్ ఉన్న 2% రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని ఒక్కోటిగా పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు. ఇప్పటి వరకు లంక భూములు, అసైన్డ్ భూముల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
వారందరికీ పెన్షన్లు ఇస్తాం: ఎమ్మెల్యే శ్రావణ్
ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. రోడ్ల నిర్మాణలు, భారీ వాహనాల రాకపోకల వల్ల కొన్ని చోట్ల స్మశాన ప్రాంతాలు ఇబ్బందికరంగా మారుతున్నాయన్నారు. మల్కాపురం, వెంకటాపురం గ్రామాల్లో స్మశానాలు లేవని... అలాగే మరికొన్ని ప్రాంతాల్లో బరెల గ్రౌండ్ ఏర్పాటు చేయాలని చెప్పామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగు వేలకు పైగా పెన్షన్లను రిజెక్ట్ చేశారని.. ఎవరెవరికి పెన్షన్లు మిస్ అయ్యాయో వాటి వివరాలు సేకరిస్తున్నామన్నారు. అలాగే కొత్తగా పెళ్లయిన వారికి కూడా పెన్షన్లు అందజేయాలని చూస్తున్నామని చెప్పారు.
శవ రాజకీయాలు మానుకోండి..
అమరావతిలో భూమి ఇచ్చిన వారికి బిలో పావర్టీ లైన్ (below poverty line) తో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. నిన్న జరిగిన ఒక గ్రామ సభలో మాట్లాడుతూ ఉండగా రైతు రామారావు అకస్మాత్తుగా మరణించడం జరిగిందన్నారు. ఆ రైతుకు ఐదు ఎకరాల భూమి ఉందని... సభలో కూడా రామారావు మాట్లాడుతూ తమకు అందించే భూమి ఎక్కడ వస్తుందో స్పష్టంగా చెప్పాలని అడిగారన్నారు. చాలా వివరంగా, ఆయన మామూలుగా మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా జరిగిన ఘటనను కొన్ని పత్రికలు, వైసీపీ నాయకులు శవాల మీద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏమీ లేని చోట ఇలాంటి దుష్ప్రచారాన్ని చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
నడిరోడ్డుపై నిలబడి ధర్మాన బ్రదర్స్‌కు దువ్వాడ సవాల్
ఎంతకు దిగజారారు.. పవన్ ఫొటోపై అసభ్యకర పోస్ట్...
Read Latest AP News And Telugu News