Srikakulam YCP: నడిరోడ్డుపై నిలబడి ధర్మాన బ్రదర్స్‌కు దువ్వాడ సవాల్
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:54 PM
గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాసు సోదరులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మరో సంచలన ఆడియో విడుదల చేశారు. ధర్మాన సోదరులు తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
శ్రీకాకుళం, డిసెంబర్ 27: జిల్లాలో వైసీపీ రాజకీయాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (MLC Duvvada Srinivas) వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ధర్మాన సోదరులు కుట్రకు తెరలేపారనే వ్యాఖ్యలు చేస్తూ గత కొంతకాలంగా ధర్మాన సోదరుల అక్రమాలపై దువ్వాడ గళమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం దువ్వాడ సతీమణి దివ్వెల మాధురికి నిమ్మాడకు చెందిన వైసీపీ కార్యకర్త ఫోన్ కాల్ చేశారు.
దువ్వాడపై ధర్మాన సోదరులు దాడి చేయబోతున్నారని తెలిపారు. త్వరలో నర్సన్నపేట లేదా నిమ్మాడ దగ్గర దువ్వాడపై దాడి చేయాలని ధర్మాన సోదరులు వ్యూహం రచించినట్లు మాధురికి అప్పన్న చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నేషనల్ హైవేపై హల్‌చల్ చేశారు. తనపై కుట్ర జరుగుతోందని అన్నారు. ధర్మాన సోదరులు తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇందుకోసం అల్లరి మూకలు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. తనను చంపడానికి ఎవడొస్తాడో రండి అంటూ నేషనల్ హైవేపై నిలబడి దువ్వాడ సవాల్ విసిరారు. తనకు ఏం జరిగినా ధర్మాన సోదరులదే బాధ్యత అని అన్నారు. ఈ వ్యహారంపై నేడు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని దువ్వాడ చెప్పారు. ప్రస్తుతం దువ్వాడ సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి...
ఎంతకు దిగజారారు.. పవన్ ఫొటోపై అసభ్యకర పోస్ట్...
ఆయన చేపలు తిన్నారు.. ఈయన కోడి కూర తిన్నారు.. జగన్, కేసీఆర్‌లపై జగ్గారెడ్డి సెటైర్లు
Read Latest AP News And Telugu News