Tomato Price: మళ్లీ పెరిగింది.. టమోటా @ 46
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:00 PM
టమోటా ధర మళ్లీ పెరిగింది. మార్కెట్లో కేజీ రూ. 46కు విక్రయిస్తుండగా.. మరికొన్నిచోట్ల రూ. రూ. 55 వరకు విక్రయిస్తున్నారు. నిన్న మిన్నటివరకు ధర లేక దిగాలు పడ్డ రైతులు పెరిగిన ధరలతో కొ్ంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం: జిల్లాలో టమోటా ధరలు ఆశాజనకంగా పలుకుతున్నాయి. వారం రోజులుగా కక్కలపల్లి టమోటా మార్కెట్(Kakkalapally Tomato Market)లో కిలో గరిష్ఠ ధర రూ.40కిపైగానే పలుకుతున్నాయి. శుక్రవారం గరిష్ఠ ధర రూ.46 పలికింది. దిగుబడులు తగ్గిపోవడమే ధరల పెరుగుదలకు కారణమన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లా నుంచి ఎగుమతి అయ్యే ప్రాంతాల్లోనూ టమోటా దిగుబడులు అంతంతమాత్రంగానే ఉండటంతో ప్రస్తుతం టమోటా(Tomato)కు ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది.

కక్కలపల్లి మార్కెట్‌కు రెండు, మూడు వేల బాక్సులకు మించి దిగుబడులు రావట్లేదు. గతంలో ఒక్కో మండీకి పదివేలకుపైగానే టమోటా బాక్సులు వచ్చేవి. శుక్రవారం మార్కెట్‌కు 1,350 టన్నుల కాయలు మాత్రమే వచ్చాయి. కిలో గరిష్ఠంగా రూ.46తో అమ్ముడుపోయాయి. కనిష్ఠంగా రూ.20 పలుకగా.. సరాసరి రూ.34తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రూప్‌కుమార్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News