Home » Tomato Price
టమోటా ధర భారీగా పెరిగింది. మర్కెట్ లో కిలో రూ. 50కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు టమోటాను కొనాలంటేనే ఒకింత భయపడే పరిస్థితి వచ్చింది. అలాగే... అనంతపురం కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో టమోటా ధర భారీగా పెరిగింది.
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమోటా కొనుగోలు చేస్తామని ఆ శాఖ ఏడీ రాఘవేంద్ర కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు టమోటా కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని సూచించారని తెలిపారు.
ములకలచెరువు మార్కెట్‌కు టమోటాలు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో అమ్మకానికి వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తోటల్లోని టమోటాలు కోయడానికి వీలు కాలేదు. వర్షాలు కాస్త తగ్గడంతో రైతులు కోతలు కోస్తున్నారు.
టమోటా ధరలు నేలచూపులు చూస్తున్నాయి. కొన్నాళ్లుగా నిలకడగా సాగుతున్న ధరలు.. పతనస్థాయికి చేరుకుంటున్నాయి. వారం రోజులుగా ధరలు తగ్గుతున్నాయి. కొన్నేళ్లుగా టమోటా ధరలు రైతులకు చేదు అనుభవాలనే మిగిల్చాయి.
సగానికి తగ్గిన టమోటా ధర.. కిలో ఎంతంటే.. Tomato Prices Drop by 50 in Madanapalle Market Farmers Face Heavy Losses
మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఏడాది పొడవునా టమోటా పంట సాగుచేస్తుంటారు. ఏ సమయంలో చూసినా మండలంలో రెండువేల ఎకరాలకుపైగా టమోటా సాగులో ఉంటుంది. ఈ యేడాది ప్రారంభంలో ధరలు లేక రైతులు నష్టాలు చవిచూశారు.
స్థానిక కోయంబేడు మార్కెట్లో టమోటా కిలో రూ.60కి పెరిగింది. ఈ మార్కెట్‌కు రాష్ట్రంలో పలు జిల్లాలు, కర్ణాటక, ఆంధ్ర తదితర రాష్ట్రాల నుంచి టమోటా దిగుమతి అవుతోంది. కొద్ది నెలల క్రితం టమోటా ధర హఠాత్తుగా కిలో రూ.100కు పెరిగింది.
ఎట్టకేలకు టమోటాకు గిట్టుబాటు ధర దక్కుతోంది. ఏడాదిగా ధరల్లేక రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. కూలి ఖర్చులు కూడా దక్కలేదు. కొంతమంది పంటను చేనులోనే వదిలేశారు. ఇంకొందరు తొలగించి, రోడ్డు పక్కనే పడేశారు.
టమోటా ధరలు పెరుగుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నెల రోజులుగా రూ. 200 నుంచి రూ. 300 లోపు పలికే 15కిలోల బాక్సు ఆదివారం రూ. 450కి చేరుకుంది.
Tomato Powder: వెజ్ లేదా నాన్ వెజ్ ఏ వంటకానికైనా టమాటా వేస్తే ఆ రుచే వేరు. అందరూ ఎక్కువగా వాడే ఈ కూరగాయ ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఒక్కోసారేమో రేటు కొండెక్కి కూర్చొంటే.. మరోసారి ఊహించనంత చౌకగా దొరుకుతుంది. తక్కువ ధర ఉన్నప్పుడు టమాటాతో ఈ నిల్వ పొడి చేసుకుంటే ఎప్పుడైనా కూరల్లోకి వాడుకోవచ్చు..