Share News

Tomato: ములకలచెరువు మార్కెట్‌కు పోటెత్తుతున్న టమోటాలు

ABN , Publish Date - Sep 24 , 2025 | 09:40 AM

ములకలచెరువు మార్కెట్‌కు టమోటాలు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో అమ్మకానికి వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తోటల్లోని టమోటాలు కోయడానికి వీలు కాలేదు. వర్షాలు కాస్త తగ్గడంతో రైతులు కోతలు కోస్తున్నారు.

Tomato: ములకలచెరువు మార్కెట్‌కు పోటెత్తుతున్న టమోటాలు

- ఒకేరోజు 706 మెట్రిక్‌ టన్నులు ఎగుమతి

- 1.20 లక్షల బాక్సుల కాయలు రాక

ములకలచెరువు(అన్నమయ్య): ములకలచెరువు మార్కెట్‌కు టమోటాలు(Tomato) గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో అమ్మకానికి వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తోటల్లోని టమోటాలు కోయడానికి వీలు కాలేదు. వర్షాలు కాస్త తగ్గడంతో రైతులు కోతలు కోస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మార్కెట్‌కు టమోటాలు రికార్డు స్ధాయిలో అమ్మకానికి వచ్చాయి. వేలాది వాహనాలు టమోటాలు తీసుకుని రావడంతో మార్కెట్‌ కిక్కిరిసిపోయింది. సోమవారం రాత్రి ఒక్కరోజే 706 మెట్రిక్‌ టన్నుల టమోటాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యాయి.


మంగళవారం కూడా భారీ స్థాయిలో వచ్చాయి. మంగళవారం మార్కెట్‌లో 22 కేజీల బాక్సు నాణ్యతను బట్టి రూ.300 నుంచి రూ.600 వరకు పలికాయి. ప్రతిరోజు లక్ష నుంచి 1.20 లక్షల క్రేట్ల కాయలు అమ్మకానికి వస్తున్నాయంటే ఎంత భారీ స్థాయిలో వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు, తంబళ్లపల్లె(Mulakala Lake, Tamballapalle), పెద్దమండ్యం, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మండలాలతో పాటు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి రైతులు టమోటాలను ఇక్కడి తీసుకొస్తున్నారు.


ap1.2.jpg

ఇక్కడి నుంచి ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. టమోటా వేలం పాటలతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 24 , 2025 | 09:40 AM