Hussain Sagar: హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
ABN , Publish Date - Sep 23 , 2025 | 10:05 AM
సిటీలోని పలు ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు హుస్సేన్ సాగర్‌కి వచ్చి చేరుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తూముల ద్వారా మూసీలోకి వరద నీటిని వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్: నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్‌కు వరద ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాలాల ద్వారా భారీగా హుస్సేన్ సాగర్లోకి వరద వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లుగా ప్రస్తుత నీటిమట్టం 513.63 మీటర్లుగా ఉన్నట్లు చెప్పారు. ఇన్ఫ్ ఫ్లో 1530 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1525 క్యూసెక్కులుగా ఉన్నట్లు వివరించారు. కూకట్ పల్లి, బంజారా, పికెట్, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద ఉద్ధృతి కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
సిటీలోని పలు ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు హుస్సేన్ సాగర్‌కి వచ్చి చేరుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తూముల ద్వారా మూసీలోకి వరద నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. దిగువన నల్గొండలో మూసీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. కాగా, అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు