BJP MLAs Thank Modi: ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ABN , Publish Date - Sep 22 , 2025 | 10:19 AM
జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చి నాలుగు స్లాబులను రెండు స్లాబులకు ప్రధాని తీసుకువచ్చారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. దేశంలోని ప్రతీ వర్గానికి మేలు చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
అమరావతి, సెప్టెంబర్ 22: ఈరోజు భారతదేశానికి శుభదినమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (MLA Vishnukuma Raju) అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి (PM Modi) అభినందనలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చి నాలుగు స్లాబులను రెండు స్లాబులకు ప్రధాని తీసుకువచ్చారని తెలిపారు. దేశంలోని ప్రతీ వర్గానికి మేలు చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అనేక వస్తువులను 12 శాతం, 18% నుంచి 5% తెచ్చారన్నారు.
ప్రాణాధార ఔషధాలను సున్నా శాతం జీఎస్టీకి తెచ్చారని తెలిపారు. ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్‌కు కూడా తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. హెల్త్ ఇన్సూరెన్స్‌లపై ఉన్న జీఎస్టీని 18% నుంచి 0% తీసుకువచ్చారన్నారు. జీఎస్టీ స్లాబుల మార్పులతో దసరా ముందుగా వచ్చిందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని అన్నారు. శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు జీఎస్టీ స్లాబ్‌లను కుదించడంపై చేసిన తీర్మానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
మోదీ టీషర్ట్‌లతో అసెంబ్లీకి..
మరోవైపు.. థాంక్యూ మోదీ నినాదంతో బీజేపీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రం ఉన్న టీ షర్ట్లు ధరించి వచ్చారు బీజేపీ సభ్యులు. జీఎస్టీపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలియజేస్తు ఉన్న టీషీర్ట్స్‌తో అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
Navaratri Durga Pooja: దుర్గమ్మ పూజలకు వేళాయె
Vijayawada: ఇంద్రకీలాద్రికి దసరా శోభ
Read Latest AP News And Telugu News