Navaratri Durga Pooja: దుర్గమ్మ పూజలకు వేళాయె
ABN , Publish Date - Sep 22 , 2025 | 09:41 AM
శరన్నవరా త్రి ఉత్సవాలతో నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో కోలాహల వాతావరణం ఆరంభమైంది. తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
నర్సీపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : శరన్నవరా త్రి ఉత్సవాలకు అమ్మవార్ల ఆలయాలతో పాటు వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఆదిమాత, అమ్మలగన్న అమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. దీంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం ఆరంభమైంది. నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో ఈ వేడుకలు మరింత ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయంతో పాటు మెయిన్ రోడ్డులో విద్యుద్దీపాలంకరణ చేపట్టారు. దేవదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి చేతుల మీదుగా ఉదయం కలశ స్థాపనతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. అక్టోబరు నాలుగో తేదీ వరకు ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు.
తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తర్వాత వరుసగా గాయత్రిదేవి, అన్నపూర్ణదేవి, మహాలక్ష్మిదేవి, లలితా త్రిపురసుందరీ దేవి, మహా చండీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసుర మర్ధినీ దేవి, రాజరాజేశ్వరిదేవి అవతారంలో అమ్మవారిని అలంకరిస్తారు. రోజుకోరకం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించనున్నారు. సహస్ర కుంకుమార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, చండీ యాగం, సామూహిక లక్ష కుంకుమార్చనకు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో దాతల సహయంలో ప్రతి రోజూ అన్న ప్రసాద వితరణ చేపట్టనున్నారు. నాలుగో తేదీన చండీయాగం నిర్వహించి పూర్ణాహుతి, ఉత్సవ వి గ్రహం నిమజ్జనం వంటివి చేపట్టనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ జంపన నాగేంద్రరాజు తెలిపారు.
ఇవి కూడా చదవండి
పబ్లిక్‌లో రెచ్చిపోయిన ప్రేమ జంట.. ముద్దులు పెట్టుకుంటూ..