Public Display Of Affection: పబ్లిక్‌లో రెచ్చిపోయిన ప్రేమ జంట.. ముద్దులు పెట్టుకుంటూ..
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:30 AM
ఓ యువకుడు బస్టాండ్‌లో రెచ్చిపోయాడు. చుట్టూ జనం ఉన్నా కూడా పట్టించుకోకుండా ప్రియురాలిని ముద్దు పెట్టుకున్నాడు. అది కూడా లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియురాలి నడుముపై చెయ్యి వేసి, బుగ్గపై ముద్దు పెట్టాడు.
ఈ మధ్య కాలంలో ప్రేమ జంటలు రెచ్చిపోతున్నాయి. ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మరీ పబ్లిక్‌గా పాడు పనులు చేస్తున్నాయి. లవర్స్ బైకుపై ఒకరిపై ఒకరు కూర్చుని ప్రయాణిస్తున్న సంఘటనలు తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. పోలీసులు అలాంటి లవర్స్‌పై చర్యలు తీసుకుంటున్నా ఎలాంటి లాభం లేకుండా పోతోంది. ప్రేమికులు పబ్లిక్‌లో బరితెగించి ప్రవర్తిస్తూనే ఉన్నారు. తాజాగా, ఓ యువకుడు బస్టాండ్‌లో రెచ్చిపోయాడు. చుట్టూ జనం ఉన్నా కూడా పట్టించుకోకుండా ప్రియురాలిని ముద్దు పెట్టుకున్నాడు.
అది కూడా లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియురాలి నడుముపై చెయ్యి వేసి, బుగ్గపై ముద్దు పెట్టాడు. ఈ సంఘటన ఎప్పుడు, ఏ ఊరిలో జరిగిందో తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇద్దరూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు. పక్కన ఏం జరుగుతోందో కూడా పట్టించుకోవటం లేదు’..‘ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదు. జైల్లో పడేయాలి’..‘ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు బాగా ఎక్కువై పోయాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవటం నేరమా?..
భారత దేశంలో పబ్లిక్‌గా ఓ జంట ముద్దు పెట్టుకోవటం నేరమే. గతంలో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 294 కింద పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోవడాన్ని నేరంగా పరిగణించేవారు. అయితే, భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చిన తర్వాత సెక్షన్ 294 రద్దయింది. దాని స్థానంలో సెక్షన్ 341 అమల్లోకి వచ్చింది. పబ్లిక్‌కు ఇబ్బంది కలిగించే అశ్లీల పనులు ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణించబడతాయి. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, వాటికి శిక్షలు ఎలా ఉంటాయన్నది మాత్రం.. నేర తీవ్రత, సంఘటన జరిగిన ప్రదేశాన్ని బట్టి మారుతుంది.
ఇవి కూడా చదవండి
అమెరికాలో ఏం జరుగుతోంది?.. ఒకే వేదికపై ట్రంప్, మస్క్..
చైనా కే వీసా.. హెచ్-1బీ వీసాకు పోటీగా..