Alluri District Murder: అల్లూరి జిల్లాలో దారుణం.. బీరు సీసాతో పొడిచి హత్య..
ABN , Publish Date - Sep 22 , 2025 | 09:45 AM
అల్లూరు జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం సృష్టిస్తోంది. కొందరు దుండగులు బీరు సీసాతో పొడిచి యువకుడి హత్య చేశారు.
అల్లూరి: జిల్లా కేంద్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడిని బీరు సీసాతో పొడిచి హత్య చేశారు దుండగులు. నిన్న(ఆదివారం) రాత్రి జీకే వీధి మండలం సీలేరు గుంటవాడ డ్యామ్ వద్ద ఘటన చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన యువకుడు చింతపల్లి క్యాంపుకు చెందిన భగత్ రామ్‌గా గుర్తించినట్లు తెలిపారు. ఈ సంర్భంగా పోలీసులు వివరాలను వెల్లడించారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. చింతపల్లి క్యాంపుకు చెందిన కులదీప్ వినోద్ అలియాస్ బాబ్లు హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం.. ఫోన్ చేసి భగత్ రామ్‌ని సీలేరు గుంటవాడ డ్యామ్ వద్దకు రప్పించినట్లు పేర్కొన్నారు. అనంతరం అతడిని బీరు సీసాతో అతి కిరాతకంగా పొడిచినట్లు వివరించారు. తీవ్ర గాయాలతో ఉన్న భగత్ రామ్‌ను సీలేరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు. అయితే పాతకక్షల నేపథ్యంలోనే రాముని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
జమ్ము సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ కదలికలు..బీఎస్ఎఫ్ గాలింపు చర్యలు