Home » Hyderabad News
హైదరాబాద్ పోలీసు శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీఐటీ (CIT.. సెంట్రల్ ఇన్వెస్ట్ గేషన్ టీమ్)ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం లభించింది. బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన టెస్ట్ అట్లస్ విడుదల చేసిన జాబితాలో 10వ స్థానం దక్కింది.
హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి త్వరితగతిన స్పందించే విధంగా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శంషాబాద్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. సెకండ్ ఇయర్ విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో.. నియోజకవర్గం వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం అయ్యారు.
నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగియడంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఓటింగ్ జరుగుతుండటంతో ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గత ప్రభుత్వం చేసిన బకాయిల వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రైవేటు విద్యా సంస్థల సంఘం ఛైర్మన్ రమేష్ ఆరోపించారు. ప్రభుత్వం ఏం చెప్పినా.. ఒక ఒబిడియెంట్ విద్యార్థి లాగా వింటున్నానని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే ఈ ఎన్నికలో మహిళల ఓట్లు కీలకంగా మారునున్నాయి.
హైదరాబాద్‌లో ఎన్నికల పండుగ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరో 4రోజులే మిగిలిఉండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. జనసమీకరణ కోసం ఒక్కో వ్యక్తి రూ.400 నుంచి రూ.500 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కింది కథనంలో చదవండి.
తల్లిదండ్రులపై ఓ కూతురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.