Share News

Wild Waters: చూపు లేని చిన్నారుల కోసం 'వైల్డ్ వాటర్స్' ప్రత్యేక కార్యక్రమం

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:18 PM

వైల్డ్ వాటర్స్ థీమ్ పార్క్ శంకర్‌పల్లిలోని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కు చెందిన చూపు లేని చిన్నారులను ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించి, ఆనందభరిత అనుభూతిని అందించింది. సిబ్బంది సహకారం, ప్రత్యేక ఏర్పాట్లతో పిల్లలు రైడ్లు, భోజనం, వినోదాన్ని నిర్బంధం లేకుండా ఆస్వాదించారు.

Wild Waters: చూపు లేని చిన్నారుల కోసం 'వైల్డ్ వాటర్స్' ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్ నగరంలోని అతిపెద్ద వాటర్ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ వైల్డ్ వాటర్స్ చూపు లేని చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నెల 6న హైదరాబాద్‌కు సమీపంలోని శంకర్‌పల్లి ప్రాంతంలో ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు చెందిన చూపు లేని చిన్నారులు, వారి తల్లిదండ్రులు, సహాయక సిబ్బందిని వైల్డ్ వాటర్స్ ఆహ్వానం అందించింది. శంకర్‌పల్లి పరిసరాల్లో 30 ఎకరాల పచ్చని వాతావరణంలో విస్తరించిన వైల్డ్ వాటర్స్.. ఈ ప్రత్యేక అతిథుల కోసం ఆనందభరితమైన, ఆత్మీయ అనుభవాన్ని సృష్టించింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది, అలాగే చిన్నారులకు అనువైన ఆకర్షణలను జాగ్రత్తగా ఎంపిక చేసినందువల్ల, ప్రతి చిన్నారి ధైర్యంగా, సంతోషంగా ప్రతి కార్యకలాపాన్ని ఆనందించారు. ఈ సందర్శన వారికి గుర్తుండిపోయే సౌఖ్యభరిత అనుభూతిని అందించింది.

WildWaters.jpg

సంతోషాన్ని ఇచ్చింది..

ప్రతి చిన్నారి ఆనందం, నిర్బంధం లేని నవ్వులకు అర్హులని వైల్డ్ వాటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు. ఈ చిన్నారులను తమ పార్క్‌కు ఆహ్వానించడం తాము ఆనందంగా భావిస్తున్నామని చెప్పారు. వచ్చిన అతిథుల కోసం ఏర్పాటు చేసిన ఈ ఆనందభరిత రోజు తమకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని అన్నారు.

WildWaters2.jpg

అనేక అవార్డులు..

50కిపైగా వాటర్, డ్రై రైడ్లతో ప్రసిద్ధిగాంచిన వైల్డ్ వాటర్స్ (www.wildwaters.in).. భారతదేశంలో విశ్వసనీయ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్‌గా నిలిచింది. 2015, 2016, 2017, 2021 సంవత్సరాల్లో తెలంగాణ టూరిజం అవార్డ్స్ బెస్ట్ థీమ్-బేస్డ్ రిసార్ట్‌గా అవార్డులు అందుకోవడంతో పాటు, తెలంగాణ పర్యాటక శాఖ ప్రకటించిన 2025 బెస్ట్ అమ్యూజ్‌మెంట్ పార్క్ అవార్డును కూడా గెలుచుకుంది. అగ్రశ్రేణి వేదికగా పేరొందిన ఈ పార్క్.. అనేక పర్ల్ ఆఫ్ హైదరాబాద్ అవార్డులను కూడా సాధించింది.

IMG_8190_01.jpg

రక్షణతో కూడిన వినోదం..

ఈ ప్రత్యేక సందర్శనలో చిన్నారుల ప్రతి అడుగులోనూ పార్క్ సిబ్బంది తోడుగా ఉండి.. రైడ్లను సులభంగా ఆస్వాదించేందుకు సహాయం చేశారు. పిల్లలు, వారి కుటుంబాల కోసం పార్క్ ఫుడ్ కోర్టలో తాజా రుచికరమైన భోజనాలను ప్రత్యేకంగా సిద్ధం చేసి అందించారు. రోజంతా నవ్వులు, ఉత్సాహం, సంతోషంతో నిండిన ఈ సందర్శన పిల్లలు, వారి కుటుంబాలకు మధురమైన జ్ఞాపకాలు మిగిల్చింది. సమాజానికి చేరువగా ఉండే వినోద అనుభవాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న వైల్డ్ వాటర్స్ సీఎస్సార్ దృక్పథాన్ని ఈ కార్యక్రమం మరింత బలపరుస్తోంది. సంతోషం పంచుకున్నప్పుడు అది మరింత అర్ధవంతం అవుతుందని, ప్రతి చిన్నారి ప్రేమ, ఆప్యాయత, మరపురాని అనుభవాలకు అర్హుడేనని వైల్డ్ వాటర్స్ మరోసారి చూపించింది.

Wildwaters4.jpg


Also Read:

హై అలర్ట్.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు..

జీవితంలో ఈ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి..

Updated Date - Dec 09 , 2025 | 03:26 PM