Home » KADAPA
యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సుల్లో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మీప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రభుత్వం ఏదైనా వైసీపీ నేతల మట్టిదందా మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ఖనిజ సంపదను, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా దోచేశారు. కడప నగరానికి కూతవేటు దూరంలోని చింతకొమ్మదిన్నె మండలంలో దందా మరింతగా సాగింది.
నకిలీ నోట్లు మార్చేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని బ్యాంకులోనే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు లక్కిరెడ్డిపల్లె మండలం కుర్నూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ నగదు విత్‌డ్రా చేసుకోవడానికి మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంకుకు వెళ్లాడు.
దేశబాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన తెలుగు భాష అతి ప్రాచీనమైనది. దీనికి సంబంధించిన తొలి తెలుగు శాసనం ఎర్రగుంట్ల మండలంలోని కలమల్ల గ్రామం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో ఉండటం గర్వకారణం.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది పార్టీని వీడగా.. తాజాగా జగన్ సొంత ఇలాకాలో కీలక నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో వైద్యం కోసం వచ్చే రోగులకు ఓపీ కష్టాలు తప్పడం లేదు. రోగం నయం చేసుకోవడానికి వైద్యం కోసం వచ్చే వారికి ఓపీ తీసుకోవడం ఎంతో కష్టంగా మారింది.
బి.కోడూరు మండలంలో గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా రిజిస్టరు పొలాలను కూడా అగ్రిమెంట్లతో యథేచ్ఛగా ఆన్లైన్ చేశారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకు వేసి పిత్రార్జిత భూములు కూడా దొంగ అగ్రిమెంట్లు తయారుచేసి తహశీల్దారు కార్యాలయంలో ఆన్లైన్ చేయించుకున్నారు.
ఆకాంక్షిత జిల్లాల్లో దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది కడప జిల్లా. వినూత్న పథకాలు, ఇతర అభివృద్ధి పథకాలు వ్యూహాత్మక ప్రణాళిక చేసి జాతీయస్థాయిలో మొదటి స్థానం సాధించారు కలెక్టర్ చెరుకూర శ్రీధర్.
వెలిగల్లు ప్రాజెక్టు పూర్తయి సుమారు 16 సంవత్సరాలు అవుతోం ది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా నిర్దేశిత ఆ యకట్టుకు నీళ్లు అందడం లేదు. పిచ్చిమొక్క లు, మట్టి, రాళ్లతో కాలువలు పూడిపోవడం.. లైనింగ్ లేకపోవడంతో.. కాలువలకు వదిలిన నీళ్లలో ఎక్కువగా ఇంకిపోవడం.. బయటకు వెళ్లిపోతున్నాయి.
కొంతకాలంగా అరటి ధరలు పాతాళానికి పడిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతూ వచ్చారు. అయితే నాలుగైదు రోజులుగా అరటి ధరలు పెరుగుతున్నాయి.