Illicit Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:10 AM
నకిలీ మద్యం కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు.
అన్నమయ్య, డిసెంబర్ 26: నకిలీ మద్యం కేసులో (Illicit Liquor Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏడుగురు నిందితులను కస్టడీ కోరుతూ తంబళ్లపల్లి కోర్టులో ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరుగగా.. ఐదుగురు నిందితులను మూడు రోజులపాటు కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నిందితులు మదనపల్లె సబ్‌జైల్లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
కోర్టు అనుమతి మేరకు ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు, ఏ26 జగన్మోహన్ రావు, ఏ 28 తాండ్ర రమేష్, ఏ 27తిరుమల శెట్టి శ్రీనివాసరావు, ఏ 29 షేక్ అల్లబక్షులను ఈరోజు (శుక్రవారం) ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిందితులను ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి మదనపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు వారిని తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎస్వీ వర్సిటీ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
అనుమానంతో భార్యకు నిప్పు పెట్టిన భర్త.. అడ్డుకోబోయిన కూతురిని కూడా
Read Latest AP News And Telugu News