Share News

Tirupati: ఎస్వీ వర్సిటీ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Dec 26 , 2025 | 09:47 AM

ఎస్వీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జూపార్క్ వద్ద కారులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

Tirupati: ఎస్వీ వర్సిటీ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
Tirupati

తిరుపతి, డిసెంబర్ 26: తిరుపతి జిల్లాలో ఓ కారులో మృతదేహం లభ్యంకావడం తీవ్ర కలకలం రేపుతోంది. జూపార్క్‌ రోడ్డులో ఆగి ఉన్న కారులో మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎస్వీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్‌గా గుర్తించారు. ఆ కారు ఆయనదే అని తెలుస్తోంది. అయితే సర్దార్‌ నాయక్‌ది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితమే ఆయన మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.


అయితే అటువైపుగా ఎవ్వరూ వెళ్లకపోవడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే సర్దార్ నాయక్ మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... నాయక్ మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా.. యూనివర్సిటీ నుంచి సర్దార్ నాయక్ మూడు నెలల క్రితమే సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది. విధులకు సక్రమంగా హాజరుకాపోవడం, తరచుగా మద్యం సేవించి విధులకు వస్తుండటంతో వర్సిటీ అధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి..

చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు.. బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 26 , 2025 | 09:49 AM