Road Accident: ఏపీలో వేర్వేరు చోట్ల ఘోర ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం
ABN , Publish Date - Dec 26 , 2025 | 09:32 AM
ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, వాతావరణ ప్రభావం కారణాలు ఏవైనా అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏపీలోనూ వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
గుంటూరు: వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏపీలో ఈ రోజు (శుక్రవారం) రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు సూర్యాపేట ప్రాంతవాసులుగా సమాచారం. విషయం తెలుసుకున్న సౌత్ డీఎస్పీ భానోదయ, సీఐ వంశీధర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వం వైద్యశాల మార్చురీకి తరలించిన నల్లపాడు పోలీసులు తెలిపారు.
మరోవైపు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. తోటి ప్రయాణికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శీతాకాలం సీజన్ లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా..
ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి..
For More AP News And Telugu News