Cold Waves: చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు.. బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం
ABN , Publish Date - Dec 26 , 2025 | 08:42 AM
ఉదయం వాకింగ్ చేసే వాళ్లు సైతం చలి కారణంగా ఇంటికే పరిమితమవుతున్నారు. చిరు వ్యాపారులతోపాటు కూరగాయల విక్రేతలు సైతం ఉదయం వేళ చలి తీవ్రత చూసి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
హైదరాబాద్/ అమరావతి, డిసెంబర్ 26: వాతావరణంలో మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తెల్లవారుజాము నుంచి మంచు దుప్పటి కప్పేసినట్లుగా ఉంటుంది. రాత్రి వేళల్లో గత రెండు వారాలుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలల్లో బయటకు వెళ్లాలంటే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు.
ఉదయం వాకింగ్ చేసే వాళ్లు సైతం చలి కారణంగా ఇంటికే పరిమితమవుతున్నారు. చిరు వ్యాపారులతోపాటు కూరగాయల విక్రేతలు సైతం ఉదయం వేళ చలి తీవ్రత చూసి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రహదారులు సైతం జన సంచారం లేకుండా నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దట్టమైన పొగ మంచు కారణంగా.. ఉదయం ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వచ్చినా.. సాయంత్రం 5.00 గంటల కల్లా మళ్లీ ఇళ్లు చేరుకుంటున్నారు. చలి, పొగ మంచు కారణంగా ఏజెన్సీ ప్రాంతం ఆహ్లాదకరంగా మారుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు.
చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు బయటకు పంపించడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఒక వేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే.. మాస్క్‌లు ధరించాలని చెబుతున్నారు. శరీరానికి వెచ్చదనం ఇచ్చే.. స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు ధరించాలని అంటున్నారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం వేళల్లో.. గోరు వెచ్చని నీటిని తాగాలని సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. వేడి వేడి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా..
ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి..
For More AP News And Telugu News