Share News

ఆ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం

ABN , Publish Date - Feb 14 , 2026 | 09:49 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కీలన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. వివరాల్లోకి వెళితే..

ఆ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం
Andhra Pradesh CM Meeting

కడప: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పులివెందుల సహా కడప జిల్లా(Kadapa District)లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల గురించి చర్చించారు. పెండింగ్‌లో ఉన్న రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, డ్రైన్లు, నిర్మాణాలు, తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని సీఎం చంద్రబాబును కోరారు ఎమ్మెల్యేలు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు దృష్టికి తెచ్చిన పెండింగ్ బిల్లులు, అసంపూర్తిగా ఉన్న పనులు గురించి విని ఆశ్చర్యం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్ల పాలనలో సొంత జిల్లాకు, సొంత నియోజకవర్గానికి జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. సొంత జిల్లాలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయనందునే ఆ స్థాయి వ్యతిరేకత మూటగట్టుకున్నారని ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. నిధులు సమకూర్చి కడపలో ఒక్కో సమస్య పరిష్కరిద్దామని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల ద్వారా కడప జిల్లాకు మళ్లీ పూర్వవైభవం మొదలైంది. మనందరం మరింత ముందుకు పోవాలి. 2029 ఎన్నికల్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేలా మనం పనిచేయాలి. పొలిటికల్ గవర్నెన్స్ కు ఈసారి అధిక ప్రాధాన్యం ఇస్తున్నా. అంటే అధికారులు, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కలిసి ప్రజలకు మంచి చేయడమే గవర్నెన్స్ ఉద్దేశం. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు జిల్లా అధికారుల పనితీరుపైనా నివేదికలు తెప్పించుకుంటున్నా. అంతేకాదు 20 నెలల్లో ఎవరి పనితీరు ఎలా ఉందనే దానిపై... అన్ని కోణాల్లో సమాచారం తెప్పించుకుంటున్నాను.

20 నెలల్లో చాలా అంశాల్లో కూటమి ప్రభుత్వం ఇమేజ్ పెరిగింది. రోజురోజుకూ బలపడేలా నేతల పనితీరు ఉండాలి. ప్రతి వర్గంలో పార్టీ పరంగా, నాయకుల పరంగా బలం పెంచుకోవాలి. రాయలసీమకు ఏం చేసినా మన హయాంలోనే జరిగింది. ఈ విషయాలు ప్రజలకు చెప్పాలి. రాయలసీమకు రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, హార్టీకల్చర్ సాగుకు ప్రోత్సాహకాలు, డ్రిప్ సబ్సిడీలు అన్నీ మనమే ఇచ్చాం. ఇక్కడ మనం చేసిన అభివృద్ధిని, మంచిని.... ప్రజలకు సరిగ్గా వివరిస్తే ప్రజల్లో ఎప్పటికీ మనదే పైచేయి. మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రతీ కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదు.. జగన్ అండ్ కోపై లోకేశ్ ధ్వజం

జగన్ హయాంలో మద్యనిషేధం పేరుతో రేట్లు పెంచారు: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 14 , 2026 | 10:00 PM