TDP: దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి..
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:46 PM
దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి.. అక్కడ మాట్లాడండి.. అంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యను జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో వైసీపీ నాయకులు లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.
- వైసీపీ ఎమ్మెల్యేలకు శ్రీనివాసరెడ్డి సవాల్
కడప: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కడప కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో రాద్ధాంతం చేయడం కాకుండా దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకెళ్లి చర్చించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి(R. Srinivas Reddy) సవాల్ విసిరారు. గురువారం స్థానిక ద్వారకానగర్ టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యను జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో వైసీపీ నాయకులు లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.
జిల్లాకు చెందిన నీటి సమస్యను ఎత్తిచూపకుండా డీఆర్‌సీ సమావేశానికి డుమ్మా కొట్టాలనే ధ్యేయంతో దుమారం లేపడం సరైంది కాదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 2020 ఆగిపోయిందని గుర్తు చేశారు. అప్పట్లో ఆ పథకానికి అనుమతులు తీసుకోకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జేబు సంస్థ అయిన పీఎల్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు ఆ పనులు కట్టబెట్టారని ఆరోపించారు.

అనుమతులు లేకపోయినా దాదాపు రూ.950 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమకు న్యాయం జరిగింది టీడీపీ హయాంలోనే అని మిగతా పార్టీలన్నీ కలిపి కనీసం పట్టుమని 10 శాతం కూడా సీమకు న్యాయం చేయలేదన్నారు. రాయలసీమలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్
శాప్‌కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు
Read Latest Telangana News and National News