Tomato: సగానికి తగ్గిన టమోటా ధర.. కిలో ఎంతంటే..
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:46 PM
సగానికి తగ్గిన టమోటా ధర.. కిలో ఎంతంటే.. Tomato Prices Drop by 50 in Madanapalle Market Farmers Face Heavy Losses
- తిరోగమనంలో మదనపల్లె మార్కెట్
- లబోదిబోమంటున్న రైతులు
మదనపల్లె(చిత్తూరు): మదనపల్లె టమోటా మార్కెట్(Madanapalle Tomato Market)కు అనంతపురం టమోటా మార్కెట్ దెబ్బతీస్తోంది. గత పది రోజులుగా మదనపల్లె మార్కెట్‌కు విక్రయానికి వస్తున్న టమోటా 80 శాతం తగ్గిపోగా, ధరలు కూడా సగానికి సగం తగ్గిపోయాయి. దీంతో రైతులు బేర్ మంటున్నారు. నిత్యం 1500 టన్నుల టమోటా విక్రయానికి వస్తున్న పరిస్థితి నుంచి నేడు కేవలం నిత్యం 90 టన్నుల టమోటా మాత్రమే విక్రయానికి వస్తుండటం చూస్తే మదనపల్లె మార్కెట్ ఎంత అధ్వాన స్థితికి దిగజారిందో.. తద్వారా మార్కెట్ వార్షిక ఆదాయంపై పెద్ద దెబ్బపడుతోంది.
మదనపల్లె మార్కెట్ దినదినం తిరోగమనం
దేశంలోనే అతి పెద్ద టమోటా మార్కెట్‌గా పేరొం దిన మదనపల్లె దినదిన ప్రవర్థమానం కాకుండా దినదినం తిరోగమనంలోకి పడిపోతోంది. 11 ఎకరాల విస్తీర్ణం వున్న మార్కెట్ ఇరుకుగా మారిపోవడం, లారీ యూనియన్ల మధ్య సమ స్యలు, టమోటా లోడింగ్, అన్‌లోడింగ్, జాక్‌పాట్ విధానం, క్రేట్లకు బాడుగ తీయడం, ముఖ్యంగా ఉదయం మార్కెట్‌కు వచ్చిన రైతులకు టమోటా ట్రేడర్స్ సాయంత్రం వరకు టమోటా బిల్లులకు డబ్బులు చెల్లించకోవడం వెరసి మదనపల్లె మార్కెట్ దినదినం అథోగతి పాలవుతోంది. దీంతో టమోటా సీజన్ ముగియకనే ఇక్కడికి ప్రతిరోజు 1500 టన్నులు నుంచి నేడు 90 టన్నుల వరకు మాత్రమే విక్రయాలకు పడి పోయాయి. ఈ దెబ్బకు ఇక్కడి టమోటా ధరలు కూడా సగానికి సగం పడిపోతున్నాయి.

గత రెండు నెలలుగా మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు నిలకడగానే సాగాయి. కాని నాలుగు రోజులుగా ధరలు ఒక్కసారిగా సగానికి సగం పడిపోయాయి. గత జూన్, జూలై నెలలు, ఆగస్టు 22వ తేది వరకు మదనపల్లె మార్కెట్‌లో టమోటా గరిష్టంగా కిలో రూ.50 పలుకగా, కనిష్టగా కిలో రూ.20 పలికాయి. ఈ ధరలు పలికిన సమయంలో రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు కాస్త లాభాలు కళ్ల చూసారు. కాని ఆగస్టు 22వ తేది నుంచి మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు ఒక్కసారిగా పతనం అవుతు న్నాయి. గరిష్ట ధర కిలో రూ. 50 నుంచి రూ.44, రూ.36, రూ.26కు పడిపోయాయి.
అలాగే కనిష్ట ధర కూడా కిలో రూ.20 నుంచి కిలో రూ.15 వరకు పడిపోయింది. అంతేకాకుండా జూన్ నెలలో ప్రతిరోజు మార్కెట్‌కు సరాసరిన 1500 మెట్రిక్ టన్నుల టమోటా విక్రయానికి రాగా, జూలైలో వెయ్యి మెట్రిక్ టన్నుల టమోటా విక్రయానికి వచ్చింది. కాని జూలై 18వ తేది నుంచి మార్కెట్‌కు వచ్చే టమోటా గణనీయంగా తగ్గిపోతూ ప్రతి రోజు 500 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఇదే ఆగస్టు నెల ప్రారంభంలో 300 టన్నులు రాగా నేడు కేవలం 96 మెట్రిక్ టన్నులకే టమోటా దిగుబడి పడిపోయింది.
అనంతపురం సీజన్ ఎఫెక్ట్...
అనంతపురం జిల్లాలో జూలై నెల నుంచి టమోటా దిగుబడి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వేడి వాతావరణం పోయి, వాతావరణం చల్లబడటం, వర్షాలు పడుతుండటంతో అక్కడి టమోటా తోటల్లో దిగుబడి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వ్యాపారులు కూడా మదనపల్లె మార్కెట్‌ను వదిలేసి అనంతపురం మార్కెట్‌కు పోలోమంటూ వెళ్లి పోయారు. ఇది కూడా మదనపల్లె మార్కెట్‌లో ధరలు పడిపోవడానికి ఒక కారణంగా చెబుతు న్నారు. అంతేకాకుండా ఇక్కడ సీజన్ ముగుస్తుం డడంతో టమోటా నాణ్యత కూడా తగ్గిపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా మదనపల్లె మార్కెట్‌తో పోలిస్తే ములకలచెరువు,
అంగళ్లు, గుర్రంకొండ మార్కెట్‌లో రైతులు తీసు కొచ్చే టమోటాలకు మంచి ధరలు వస్తుండటంతో రైతులు ఈ మార్కెట్‌లకే ప్రాధాన్యత ఇస్తూ మదన పల్లె మార్కెట్‌ను తిరస్కరిస్తున్నారు. దీంతో దేశంలో అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పేరుపొందిన మదనపల్లె మార్కెట్ తిరోగమనంలో పడిపోతోంది. మదనపల్లె టమోటా మార్కెట్‌కు గతంలో మార్కెట్ సెస్సు కింద వసూలు చేయడం, మండీల అద్దెలు, మార్కెట్‌లో షాపింగ్ గదుల అద్దె కలిపి వార్షిక ఆదాయం రూ.3కోట్లకు పైగా వచ్చేది. భవిష్యత్‌లో పై తెలిపిన పరిస్థితులు కొనసాగితే మదనపల్లె మార్కెట్ వార్షిక ఆదాయం గణనీయంగా పడిపోయి, సగానికి సగం తగ్గిపోయినా ఆశ్చర్యపడనవసరం లేదని విశ్లేషకుల అభిప్రాయం. ఇకనైనా జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మదన పల్లె మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాల్సి వుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News