Share News

Nalgonda: గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

ABN , Publish Date - Aug 30 , 2025 | 02:51 AM

నల్లగొండ జిల్లా హాలియా మునిసిపాలిటీ పరిధిలోని అనుముల కేవీ కాలనీలో గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో శుక్రవారం ఓ బాలుడు మృతి చెందాడు.

Nalgonda: గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

  • పాటలు పెడుతుండగా విద్యుదాఘాతం

  • నల్లగొండ జిల్లాలో ఘటన

  • మెదక్‌లో పాముకాటుతో రైతు మృతి

హాలియా/చేగుంట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా హాలియా మునిసిపాలిటీ పరిధిలోని అనుముల కేవీ కాలనీలో గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో శుక్రవారం ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన దండెం మహేందర్‌, మౌనికల కుమారుడు మణికంఠ(11)స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మండపం వద్ద పాటలు పెట్టే క్రమంలో విద్యుత్‌ వైర్‌ తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న హాలియా సీఐ సతీశ్‌రెడ్డి, ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మండపంలో విద్యుత్‌ పనులు ఎలక్ట్రీషియన్లతోనే చేయించాలని, పిల్లలను విద్యుత్‌ పరికరాల వద్దకు అనుమతించవద్దని సూచించారు.


మరోవైపు, మెదక్‌ జిల్లా చేగుంట మండల పరిధిలోని ఇబ్రహీంపూర్‌ గ్రామంలో పాము కాటుతో ఓ రైతు చనిపోయాడు. చౌదరి రఘురాములు(49) తనకున్న అరెకరం పొలంలో మంగళవారం పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు అతన్ని నార్సింగి పైవ్రేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తర్వాత హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం రఘు రాములు మృతి చెందాడు. ’

Updated Date - Aug 30 , 2025 | 02:51 AM