Share News

Tomato: మళ్లీ.. నేల చూపులు.. వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన టమోటా ధరలు

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:41 AM

టమోటా ధరలు నేలచూపులు చూస్తున్నాయి. కొన్నాళ్లుగా నిలకడగా సాగుతున్న ధరలు.. పతనస్థాయికి చేరుకుంటున్నాయి. వారం రోజులుగా ధరలు తగ్గుతున్నాయి. కొన్నేళ్లుగా టమోటా ధరలు రైతులకు చేదు అనుభవాలనే మిగిల్చాయి.

Tomato: మళ్లీ.. నేల చూపులు.. వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన టమోటా ధరలు

- దారుణంగా పడిపోతున్న వైనం

- ఆందోళన చెందుతున్న అన్నదాతలు

అనంతపురం: టమోటా ధరలు నేలచూపులు చూస్తున్నాయి. కొన్నాళ్లుగా నిలకడగా సాగుతున్న ధరలు.. పతనస్థాయికి చేరుకుంటున్నాయి. వారం రోజులుగా ధరలు తగ్గుతున్నాయి. కొన్నేళ్లుగా టమోటా(Tomato) ధరలు రైతులకు చేదు అనుభవాలనే మిగిల్చాయి. నిలకడలేని ధరలతో దెబ్బతింటూనే ఉన్నారు. ధర పెరిగింది అనుకునేలోపు.. మళ్లీ తగ్గిపోవడంతో చాలా వరకు న ష్టాలనే చవిచూశారు. గిట్టుబాటు ధర కోసం రో డ్డెక్కిన సందర్భాలు లేకపోలేదు. గతేడాది ఘటనలే ఇందుకు నిరద్శనంగా చెప్పవచ్చు. నష్టాలను దిగమింగుకుని ఈ ఏటా రైతులు పంట పెట్టారు. ఈ సారి సాగు విస్తీర్ణం తగ్గినట్లు సంబంధింత వర్గాల ద్వారా తెలుస్తోంది.


దీంతో సీజన్‌ ప్రారంభం నుంచి ధరలు నిలకడగా ఉం టున్నాయి. రెండు, మూడు నెలలపాటు ధరలు స్థిరంగానే పలికాయి. జిల్లాలోని టమోటా మార్కెట్ల నుంచి ఎగుమతి అయ్యే ప్రాంతాల్లో స్థానికంగా కాయలు మార్కెట్‌కు రాకపోవడం రైతులకు కలిసొచ్చింది. నిత్యం నష్టాలను చవిచూసిన రైతులు కొంత ఊరటనిచ్చాయి. ప్రస్తుతం పరిస్థితులు మళ్లీ మొదటికి తెస్తున్నాయన్నా భయం సంబంధిత వర్గాల్లో నెలకొంటున్నాయి. కొన్ని రోజులుగా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. వారం రోజులుగా పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ధరలు పతనస్థాయికి తీసుకెళ్తున్నాయి. దీంతో సంబంధిత వర్గాల్లో ఆందోళనలు రేగుతున్నాయి.


ప్రారంభంలో బాగున్నా..

టమోటా ధరలు సీజన్‌ ప్రారంభంలో బాగా పలికాయి. సీజన్‌ ప్రారంభం నుంచి కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో మేలిరకం కాయలు కిలో రూ.30 నుంచి రూ.35 మధ్య పలుకుతున్నాయి. గత నెలలో రూ.40 నుంచి రూ.47 వరకు పలికాయి. అంటే పదిహేను కిలోల బాక్సు రూ.600 నుంచి రూ.700 మధ్య అమ్ముడుపోయింది. సరాసరి గత రెండు, మూడు నెలలు 15కిలోల బాక్సు రూ.350 నుంచి రూ.400 పలికినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో రైతులకు లాభాలను తెచ్చిపెట్టాయి. గత వారం రోజులుగా పరిస్థితులు మారిపోయాయి. కిలో రూ.25 లోపే పలుకుతున్నాయి. గురువారం ధరలు మరింత దిగజారిపోయాయి. కిలో గరిష్ఠ ధర రూ.15తో అమ్ముడుపోయాయి. దీంతో ధరను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.


nnn.jpg

తగ్గుతున్న ఎగుమతులు..

జిల్లాలో ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. ఎగుమతులు మందగించాయంటూ మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రభావం ప్రస్తుత ధరలపై పడుతోందంటున్నారు. జిల్లాలోని మార్కెట్ల నుంచి పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు టమోటా ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం ఆయా మార్కెట్లకు స్థానికంగా కాయలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎగుమతులు లేక ధరలు తగ్గుతున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో జిల్లాలోని మార్కెట్లలో కాయలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని రైతులు అంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన కొందరు వ్యాపారులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అమ్మకాలు తగ్గిపోవడంతో రెండు, మూడు బండ్లు లోడుచేసే వ్యాపారులు ఒకటికి చాలు అనేస్తున్నట్లు సమాచారం.


గత వారం రోజులుగా కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా ధరల వివరాలు...

తేదీ మార్కెట్‌కు గరిష్ఠ సరాసరి కనిష్ఠ

వచ్చిన టమోటా ధర ధర ధర

(టన్నుల్లో..) (కిలో రూ.) (కిలో రూ.) (కిలో రూ.)

ఆగస్టు 29 3,225 23 19 14

ఆగస్టు 30 3,225 23 19 14

ఆగస్టు 31 3,000 25 19 14

సెప్టెంబరు 1 2,850 26 19 14

సెప్టెంబరు 2 3,000 23 18 14

సెప్టెంబరు 3 3,375 21 17 14

సెప్టెంబరు 4 3,075 15 13 10


కూలీల ఖర్చులు కూడా వచ్చేలా లేవు

రెండు విడతల్లో టమోటా సాగు చేశా. తొలి విడతలో ఎకరంలో పెట్టా. రెండవ విడతలో ఒకటిన్నర ఎకరాల్లో సాగు చేశా. పెట్టుబుడులు భారీగానే వచ్చాయి. మొదటి కోతలో 60బాక్సులు అయ్యాయి. బాక్సు రూ.280, రెండో కోతలో వంద బాక్సులు రూ.200తో అమ్ముడుపోయాయి. మూడో కోత కోసి 180 బాక్సులు తీసుకొచ్చా. బాక్సు రూ.120తో అమ్ముడుపోయింది. ఖర్చులు, బాడుగలు, కమీషన్‌ ఇతరత్రా రూపాల్లో వచ్చిన ధరలో సగం మార్కెట్‌లోనే పోతోంది. ఈ ధరతో పంటకోసిన కూలీల ఖర్చులు కూడా దక్కేలా లేవు.

- రామన్న, దేవిరెడ్డిపల్లి, రాయదుర్గం మండలం


పెట్టుబడులైనా దక్కుతాయో.. లేదో..?

మూడు ఎకరాల్లో టమోటా సాగు చేశా. పెట్టుబడుల రూపంలో రూ.2లక్షలకుపైగానే ఖర్చు అయింది. ఇప్పటి వరకు ఐదు కోతలు కోశా. కొంత వరకు పెట్టుబడి వచ్చింది. పదిరోజులుగా ధరలు తగ్గిపోతున్నాయి. ధరల తగ్గుదల చూస్తుంటే భయమేస్తోంది. కనీసం పెట్టుబడులైనా దక్కుతాయో.. లేదో.. చూడాలి.

- ఎర్రిస్వామి, ఆత్మకూరు


ఈ వార్తలు కూడా చదవండి..

రేపు సంపూర్ణ చంద్రగ్రహణం

పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత

Read Latest Telangana News and National News

Updated Date - Sep 06 , 2025 | 11:41 AM